Nalgonda : తల్లి బతికుండగానే పెద్దకర్మ.. అయినా కొడుకుని క్షమించిన మాతృమూర్తి.. అదీ అమ్మంటే...!

Nalgonda  : తల్లి బతికుండగానే పెద్దకర్మ.. అయినా కొడుకుని క్షమించిన మాతృమూర్తి.. అదీ అమ్మంటే...!
Nalgonda : కన్నతల్లి బతికుండగానే ఓ కొడుకు కఠినంగా వ్యవహరించాడు. ఆమె బతికుండగానే పెద్దకర్మ చేయాలనీ చూశాడు. ఈ మేరకు తన తల్లి పేరుతో సంతాప కార్డు ముద్రించాడు.

Nalgonda : కనిపెంచిన తల్లి మీద కనికరం లేకుండా పోతోంది.. డబ్బే ప్రధానంగా బతుకుతున్నారు. వృద్ధాప్యంలో అమ్మ కష్టపడుతుంటే చూసి వారించాల్సింది పోయి, ఆమె సంపాదించే పదో పరకో కూతుర్లకు పెడుతుందన్న అక్కసు పెంచుకున్నాడు అమ్మ మీద. కన్నతల్లి బతికుండగానే ఓ కొడుకు కఠినంగా వ్యవహరించాడు. ఆమె బతికుండగానే పెద్దకర్మ చేయాలనీ చూశాడు. ఈ మేరకు తన తల్లి పేరుతో సంతాప కార్డు ముద్రించాడు.

ఈ విషయం తెలిసి ఆమె పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన వారణాశి పోశమ్మకు మొత్తం ఇద్దరు కొడుకులు, నలుగురు కుమార్తెలు.. అందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి.

ప్రస్తుతం పోశమ్మ తన చిన్న కొడుకు దగ్గర ఉంటోంది. వృద్ధాప్యంలోనూ కూలి పనులకు వెళ్తోంది. అయితే ఆమె సంపాదించింది మొత్తం కూతుళ్ళకే పెడుతుందని కక్ష పెంచుకున్నాడు ఆమె పెద్దకొడుకు యాదగిరి. ఈ క్రమంలో తన తల్లి చనిపోయిందని, పెద్ద కర్మ చేస్తున్నామని కార్డు ప్రింట్ చేయించి సోషల్ మీడియాలో వైరల్‌ చేశాడు. ఈ విషయం ఆమెకి తెలియడంతో కొడుకు చేసిన పనికి కన్నీరుమున్నీరైంది.

అతడు చేసిన నిర్వాకంపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపైన స్పందించిన ఎస్సై యాదగిరిని పిలిచి మందలించారు. పొలీస్ స్టేషన్ లోనే పోశమ్మకు యాదగిరి చేత క్షమాపణలు చెప్పించారు. అంతే ఆ తల్లి మనసు కరిగిపోయింది. తమ కుటుంబ సభ్యుల మధ్య అన్నీ విషయాలు మాట్లాడుకుంటామని అక్కడినుంచి తల్లికొడుకులు వెళ్ళిపోయారు..

Tags

Read MoreRead Less
Next Story