Mahabubnagar: మహబూబ్‌నగర్‌ జిల్లాలో తాగుబోతు టీచర్.. పట్టపగలే మద్యం సేవించి తరగతి గదిలోనే..

Mahabubnagar: మహబూబ్‌నగర్‌ జిల్లాలో తాగుబోతు టీచర్.. పట్టపగలే మద్యం సేవించి తరగతి గదిలోనే..
Mahabubnagar: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పట్టపగలే మద్యం మత్తులో జోగుతున్నాడు.

Mahabubnagar: విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు పట్టపగలే మద్యం మత్తులో జోగుతున్నాడు. పీకలదాక ఫుల్లుగా తాగి పాఠశాల తరగతి గదిలోనే గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో తాగబోతు టీచర్ వైనం వెలుగుచూసింది. విద్యార్థుల సమాచారంతో పాఠశాలకు వెళ్లిన గ్రామస్తులు.. ఉపాధ్యాయుడిని నిలదీశారు. మద్యంమత్తులో పొంతనలేని సమాధానాలు ఇస్తూ గ్రామస్తులపైనే ఎదురుతిరిగాడు. మద్యం సేవించి రోజూ స్కూల్‌కు వస్తున్న ఉపాధ్యాయుడిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

Tags

Next Story