కరోనా బారిన తల్లిదండ్రులు.. పంటపొలాల్లో స్వయంగా .. నారు పోసి...!

తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయింది ఆ యువతి. కుటుంబం అంతా కరోనా బారినపడి మంచానికే పరిమితం కావటంతో ఒకపక్క సేవలు చేస్తూ.. మరో పక్క వ్యవసాయ పనులకు సిద్ధమైంది గిరిజన యువతి రమ్య. పొలంలో స్వయంగా దుక్కిదున్ని నేలను చదును చేసింది. అటు చదువు, ఆటల్లోనూ ప్రతిభ కనబరిచి ఇటు కుటుంబ బారం మోస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం రామచంద్రునిపేటకు చెందిన రమ్య... దుమ్ముగూడెం ఆశ్రమ పాఠశాలలో ప్రాథిక చదువుల అనంతరం ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రైవేటు కళాశాలలో వ్యాయమవిద్యను అభ్యసిస్తోంది. కరోనా కారణంగా సెలవులతో ఇంటి వద్దే ఉంటోంది. కరోనా బారిన తల్లిదండ్రులు, తోబుట్టుకు సేవలు చేస్తూ ఆదుకున్నది. పంట పొలాల్లో నాట్లు వేసేందుకు సమయం రావటంతో తానే స్వయంగా అరకట్టి దుక్కి దున్ని నారుపోసింది రమ్య.
వరి, పత్తి వ్యవసాయపనులను పూర్తి చేసింది. కుటుంబ పోషణ, ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో పొలం పనుల్లో నిమగ్నమైంది రమ్య. కష్టసమయంలో కుటంబానికి సాయపడటమేగా శ్రమకోర్చి పనులు చేస్తూ అందరికి ఆదర్శప్రాయంగా నిలిచిన రమ్యను చూసి స్థానికులు అభినందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com