ACB: అవినీతి సంపాదన అక్షరాల రూ.600 కోట్లు..?

ACB: అవినీతి సంపాదన అక్షరాల రూ.600 కోట్లు..?
X
భారీగా ఈఎన్సీ మురళీధర్‌రావు అక్రమాస్తులు.. ఖరీదైన ప్రాంతాల్లో స్థలాలు, విల్లాలు... మార్కెట్ విలువ రూ.600 కోట్లని అంచనా

తె­లం­గాణ మాజీ ఇం­జ­నీ­ర్ ఇన్ చీఫ్ సి. ము­ర­ళీ­ధ­ర్‌­రా­వు­ను ఆదా­యా­ని­కి మిం­చిన ఆస్తుల కే­సు­లో ఏసీ­బీ అధి­కా­రు­లు అరె­స్ట్ చే­శా­రు. కో­ర్టు ఆయ­న­కు 14 రో­జుల రి­మాం­డ్ కూడా వి­ధిం­చిం­ది. అయి­తే ము­ర­ళీ­ధ­ర్ రావు అక్ర­మా­స్తు­లు చూసి అవి­నీ­తి ని­రో­ధక శాఖ అధి­కా­రు­లే ని­శ్చే­ష్టు­లు అయ్యా­రు. హై­ద­రా­బా­ద్‌­తో పాటు 11 ప్రాం­తా­ల్లో ని­ర్వ­హిం­చిన సో­దా­ల్లో రూ. 600 కో­ట్ల­కు పైగా అక్ర­మా­స్తు­లు బయ­ట­ప­డి­న­ట్లు తె­లు­స్తోం­ది. ఇం­దు­లో మో­కి­ల­లో 1.5 ఎక­రాల స్థ­లం, 11 ఎక­రాల పొలం, పలు వి­ల్లా­లు, ఫ్లా­ట్లు, వా­ణి­జ్య సము­దా­యా­లు, ఒక సో­లా­ర్ పవర్ ప్రా­జె­క్ట్ ఉన్నా­యి. జూ­బ్లీ­హి­ల్స్, మో­కిల, కరీం­న­గ­ర్, జహీ­రా­బా­ద్, వరం­గ­ల్, కో­దా­డ­తో సహా మొ­త్తం 11 ప్రాం­తా­ల్లో ఆయ­న­కు, ఆయన బం­ధు­వు­లు, సన్ని­హి­తు­ల­కు సం­బం­ధిం­చిన ఇళ్ల­లో ఏక­కా­లం­లో సో­దా­లు ని­ర్వ­హిం­చా­రు. ఈ సో­దా­ల్లో భా­రీ­గా అక్ర­మా­స్తు­లు బయ­ట­ప­డ్డా­యి. ము­ర­ళీ­ధ­ర్‌­రా­వు అక్ర­మా­స్తుల మా­ర్కె­ట్ వి­లువ రూ. 600 కో­ట్ల­ను మిం­చి ఉం­డ­వ­చ్చ­ని ఏసీ­బీ అధి­కా­రు­లు అం­చ­నా వే­స్తు­న్నా­రు.

బంధువుల పేరు మీద...

కరీం­న­గ­ర్‌­లో ము­ర­ళీ­ధ­ర్‌­రా­వు సో­ద­రు­డు డా­క్ట­ర్ రా­మ్మో­హ­న్‌­రా­వు, సమీప బం­ధు­వు రవీం­ద­ర్‌­రా­వు ఇళ్ల­లో­నూ సో­దా­లు జరి­గా­యి. అలా­గే, ము­ర­ళీ­ధ­ర్‌­రా­వు కు­మా­రు­డు అభి­షే­క్‌­కు చెం­దిన హను­మ­కొం­డ­లో­ని సహ­స్ర ఇన్‌­ఫ్రా కన్‌­స్ట్ర­క్ష­న్ కం­పె­నీ­లో కూడా ఏసీ­బీ అధి­కా­రు­లు కీలక దస్త్రా­ల­ను స్వా­ధీ­నం చే­సు­కు­న్నా­రు.

అమ్మో.. ఎన్ని అక్రమాస్తులో

హై­ద­రా­బా­ద్‌­లో­నే అత్యంత ఖరీ­దైన ప్రాం­తం­గా పే­రు­న్న మో­కి­ల­లో 6,500 చద­ర­పు గజాల స్థ­లం (దా­దా­పు ఎక­రం­న్నర), హై­ద­రా­బా­ద్ శి­వా­ర్ల­లో 11 ఎక­రాల వ్య­వ­సాయ భూమి, బం­జా­రా­హి­ల్స్, యూ­సు­ఫ్‌­గూడ, కో­కా­పేట, బే­గం­పే­ట­ల్లో నా­లు­గు ఫ్లా­ట్లు, కొం­డా­పూ­ర్‌­లో ఒక వి­ల్లా, అత్యంత ఖరీ­దైన ప్రాం­తా­ల్లో నా­లు­గు ఇంటి స్థ­లా­లు, హై­ద­రా­బా­ద్, కరీం­న­గ­ర్‌­ల­లో రెం­డు కమ­ర్షి­య­ల్ క్లాం­పె­క్స్‌­లు, కో­దా­డ­లో ఒక అపా­ర్ట్‌­మెం­ట్, వరం­గ­ల్‌­లో ని­ర్మా­ణం­లో ఉన్న మరో అపా­ర్ట్‌­మెం­ట్, జహీ­రా­బా­ద్‌­లో 2 KV సో­లా­ర్ పవర్ ప్రా­జె­క్టు , మె­ర్సి­డె­స్ బెం­జ్‌­తో సహా మూడు కా­ర్లు ఉన్న­ట్లు ఏసీ­బీ సో­దా­ల్లో బయ­ట­ప­డిం­ది. ము­ర­ళీ­ధ­ర్‌­రా­వు ఉమ్మ­డి ఆం­ధ్ర­ప్ర­దే­శ్‌­లో ENC జన­ర­ల్‌­గా పదవీ వి­ర­మణ పొం­ది­నా కే­సీ­ఆ­ర్ ప్ర­భు­త్వ హయాం­లో తన పద­వీ­కా­లా­న్ని పదే­ళ్ల­పా­టు పొ­డి­గిం­చు­కు­న్నా­రు. ఈ కా­లం­లో కా­ళే­శ్వ­రం ప్రా­జె­క్టు­లో అత్యంత కీ­ల­క­మైన బా­ధ్య­త­లు ని­ర్వ­ర్తిం­చా­రు. కాం­గ్రె­స్అధి­కా­రం­లో­కి వచ్చిన తర్వాత కూడా ఆయన కొం­త­కా­లం కొ­న­సా­గా­రు. పదవీ వి­ర­మణ తర్వాత 13 ఏళ్ల­పా­టు నీ­టి­పా­రు­దల శా­ఖ­లో­నే పని­చే­శా­రు. ఈ కా­లం­లో­నే ఆయన భా­రీ­గా అక్ర­మా­స్తు­లు కూ­డ­బె­ట్టి­న­ట్లు ఏసీ­బీ వి­చా­ర­ణ­లో తే­లిం­ది.

Tags

Next Story