Telangana : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మొదలైన దరఖాస్తుల స్వీకరణ..!

Telangana : రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. గ్రూప్-1, పోలీసు సహా ఇతర యూనిఫాం ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. 503 గ్రూప్ వన్ పోస్టుల కోసం ఈ నెలాఖరు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. TSPSC వెబ్‌సైట్‌లో అందుబాటులో లింక్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్-వన్‌కు అప్లై చేసే అభ్యర్థులు...రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులకు అనుగుణంగా ముందు ఓటీఆర్ సవరించుకోవాలి.
పోలీసు,ఇతర యూనిఫాం పోస్టులకు కూడా దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఈ నెల 20 వరకు స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. పోలీసు శాఖలో 541 ఎస్‌ఐ, 14 వేల 881 కానిస్టేబుళ్ల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఫైర్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్‌లో 26 స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌లు, 610 ఫైర్ మెన్ కొలువులకు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు.
స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో 12 ఎస్‌ఐ, 390 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జైళ్ల శాఖలో 8 డిప్యూటి జైలర్, 146 వార్డర్లు, రవాణా శాఖలో 63 ట్రాన్స్‌పోర్టు కానిస్టేబుల్ల పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. ఈ నెల 20 రాత్రి పది గంటల వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని పోలీసు నియామక మండలి అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com