ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఆరుగురు అక్కడికక్కడే..

ఓఆర్ఆర్‌పై ఘోర ప్రమాదం.. ఆరుగురు అక్కడికక్కడే..
X
సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటిగ్రామం వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది.

ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారు. సీఐ రామిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం పాటిగ్రామం వద్ద ఔటర్ రింగ్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. దిల్లీకి చెందిన కొందరు బొలేరో వాహనంలో హైదరాబాద్ నుంచి పటాన్‌చెరు వైపు వెళుతున్నారు. వారి వాహనం పాటిగ్రామ శివారు చేరుకునేసరికి అదే రోడ్డుపై వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది.

దీంతో బొలేరో వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ఉన్న ఆరుగురికి తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని సమీపంలోని ఆస్పతికి తరలించారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పటాన్‌చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Tags

Next Story