ACCIDENT: బతుకులు తెల్లారిపోయాయ్

ACCIDENT: బతుకులు తెల్లారిపోయాయ్
X
కుటుంబాల్లో విషాదాన్ని నింపిన చేవెళ్ల బస్సు ప్రమాదం

చే­వె­ళ్ల బస్సు ప్ర­మా­దం ఎన్నో కు­టుం­బా­ల్లో చీ­క­టి­ని నిం­పిం­ది. ఎన్నో కు­టుం­బా­ల్లో తీ­ర­ని శో­కా­న్ని మి­గు­ల్చిం­ది. ఈ ప్ర­మా­దం­లో ఆప్తు­ల­ను కో­ల్పో­యిన వారు పె­డు­తు­న్న కం­ట­త­డి అం­ద­రి హృ­ద­యా­ల­ను పిం­డే­స్తోం­ది. బస్సు ప్ర­మా­దం­లో ఇద్ద­రు చి­న్నా­రు­లు అనా­థ­ల­య్యా­రు. మీ­ర్జా­గూడ సమీ­పం­లో ఆర్టీ­సీ బస్సు­ను టి­ప్ప­ర్‌ ఢీ­కొ­న్న ఘట­న­లో వి­కా­రా­బా­ద్‌ జి­ల్లా యా­లా­ల్‌ మం­డ­లం హా­జీ­పూ­ర్‌­కు చెం­దిన భా­ర్యా­భ­ర్త­లు బం­ద­ప్ప, లక్ష్మీ మృతి చెం­దా­రు. వారి పి­ల్ల­లు భవా­నీ, శి­వ­లీల ప్రా­ణా­ల­తో బయ­ట­ప­డ్డా­రు. ఘట­న­స్థ­లి­లో ని­ర్జీ­వం­గా పడి­వు­న్న తమ తల్లి­దం­డ్రు­ల­ను చూ­సు­కుం­టూ కన్నీ­రు­ము­న్నీ­రు­గా వి­ల­పిం­చా­రు. ఈ ఘోర ప్ర­మా­దం ఓ కు­టుం­బం­లో అం­తు­లే­ని వి­షా­దం నిం­పిం­ది. ఒకే తల్లి­కి పు­ట్టిన ము­గ్గు­రు అక్కా­చె­ల్లె­ళ్లు రో­డ్డు ప్ర­మా­దం­లో మర­ణిం­చా­రు. తాం­డూ­రు­లో­ని గాం­ధీ­న­గ­ర్‌­లో ని­వా­సం ఉండే ఎల్ల­య్య గౌ­డ్‌­కు ము­గ్గు­రు కు­మా­ర్తె­లు నం­ది­ని, సా­యి­ప్రియ, తనూష ఉన్నా­రు. వారు హై­ద­రా­బా­ద్‌­లో చదు­వు­తు­న్నా­రు. ఇటీ­వ­లే బం­ధు­వు­లు పె­ళ్లి ఉం­డ­టం­తో సొం­తూ­రి­కి వచ్చా­రు. వే­డు­క­ల­ను ము­గిం­చు­కొ­ని నగ­రా­ని­కి పయ­న­మైన వా­రి­ని మృ­త్యు­వు కబ­ళిం­చిం­ది.

కోఠి ఉమెన్స్ కాలేజీ స్టూడెంట్స్ మృతి

ఈ ప్ర­మా­దం­లో 21 మంది మృతి చెం­ద­గా.. పలు­వు­రి­కి తీ­వ్ర గా­యా­ల­య్యా­యి. ఈ ఘట­న­లో మృతి చెం­ది­న­వా­రి­లో ము­గ్గు­రు కోఠి వీ­ర­నా­రి చా­క­లి ఐల­మ్మ మహి­ళా యూ­ని­వ­ర్సి­టీ­కి చెం­దిన స్టూ­డెం­ట్స్ ఉన్న­ట్లు తె­లు­స్తోం­ది. మృతి చెం­దిన యు­వ­తు­లు సాయి ప్రియ, నం­ది­ని, ము­స్కా­న్ లు కోఠి మహి­ళా యూ­ని­వ­ర్సి­టీ వి­ద్యా­ర్థు­ల­ని ప్రి­న్సి­పా­ల్ లోక పా­వ­ని తె­లి­పా­రు. ఈ ప్ర­మా­దం­లో తమ ము­గ్గు­రు వి­ద్యా­ర్థు­లు మృతి చెం­ద­టం బా­ధా­క­ర­మ­ని ప్రి­న్సి­పా­ల్ అన్నా­రు.

Tags

Next Story