Kamareddy: తల్లికొడుకుల ఆత్మహత్య కేసులో పోలీసులకు లొంగిపోయిన ఆరుగురు నిందితులు..

Kamareddy: రామాయంపేటకు చెందిన తల్లికొడుకుల సూసైడ్ కేసులో ఆరుగురు నిందితులు కామారెడ్డి పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఏ1గా ఉన్న రామాయంపేట్ మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్, ఏ2గా ఉన్న మార్కెట్ కమిటీ ఛైర్మన్ యాదగిరి సహా మరో నలుగురు నిందితులు.. కేసు వెలుగుచూసినప్పటి నుంచి పరారీలో ఉన్నారు. ఇవాళ కామారెడ్డి పోలీసులకు స్వయంగా లొంగిపోయారు.
ఈ కేసులో గతంలో రామాయంపేట సీఐగా పనిచేసి ప్రస్తుతం నల్గొండ జిల్లా తుంగతుర్తిలో విధులు నిర్వహిస్తున్న నాగార్జున గౌడ్‌ని ఏ7గా చేర్చారు. రామాయంపేట్‌కు చెందిన సతీష్... తన తల్లితో కలిసి కామారెడ్డిలోని లాడ్జీలో పెట్రోల్ పోసుకుని సజీవదహన మయ్యారు. టీఆర్‌ఎస్ నేతల వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్ నోటోతో పాటు సెల్ఫీ వీడియా తీసుకున్నారు. తల్లికొడుకు సూసైడ్ అంశంలో టీఆర్‌ఎస్ నేతల పాత్ర వెలుగుచూడడంతో రామాయంపేట్ ఆగ్రహంతో ఊగిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com