ఎంఐఎం నేత కాల్పులు : జమీర్ మృతి!

X
By - TV5 Digital Team |26 Dec 2020 3:09 PM IST
ఆదిలాబాద్ పట్టణంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి చెందాడు.
ఆదిలాబాద్(Adilabad) పట్టణంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫారూక్ అహ్మద్ (MIM leader Shah Rukh Ahmed )జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సయ్యద్ జమీర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున మృతి చెందాడు. దీంతో జమీర్ మృతదేహాన్ని ఆదిలాబాద్ కు తరలిస్తున్నారు. ఈ నెల 18న ఆదిలాబాద్ పట్టణం తాటిగుడాలో జరిగిన యువకుల గొడవలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ తుపాకీ, కత్తితో దాడి చేయగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ జమీర్ హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ మరణించాడు. జమీర్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. నిందితుడు ఫారూక్ అహ్మద్‌ను కఠినంగా శిక్షించాలంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com