సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ఆదివాసీల ఆందోళన

సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ఆదివాసీల ఆందోళన
బీజేపీ నేత సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో ఎండ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు.

ఆదిలాబాద్ రూరల్‌ మండలంలో రేణుక సిమెంట్ ఫ్యాక్టరీ ముందు ఆదివాసీ భూ నిర్వాసితుల ఆందోళన చేపట్టారు. బీజేపీ నేత సుహాసినిరెడ్డి ఆధ్వర్యంలో ఎండ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. దాంతో భూ నిర్వాసితుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఆ తర్వాత పురుగుల మందు డబ్బాలతో భూ నిర్వాసితులు ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దాంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం తలెత్తింది.

రేణుక సిమెంట్ ఫ్యాక్టరీకి ఇచ్చిన తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలని భూనిర్వాసితుల డిమాండ్ చేశారు. జీఓ నంబర్ 40 ప్రకారం మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తి చేయాలని.. కానీ ఇంతవరకు పనులు ప్రారంభించలేదన్నారు. భూములు ఇచ్చిన వారి కుటుంబాలకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉన్నా నేటికీ ఇవ్వలేదని భూనిర్వాసితులు మండిపడ్డారు.

Tags

Next Story