ADR: 13 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు

దేశంలో 13 మంది ముఖ్యమంత్రుల మీద క్రిమినల్ కేసులున్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. 10 మంది సీఎంల మీద కిడ్నాప్, లంచం, హత్యాయత్నం లాంటి క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. దేశంలోనే అత్యధిక కేసులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉన్నాయి. ఈ కాంగ్రెస్ సీఎం మీద 89 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మీద 13 కేసులతో నాలుగో స్థానంలో ఉన్నారు. దేశంలో కేవలం ఇద్దరు మహిళా సీఎంలు ఢిల్లీ - అతిషి, పశ్చిమ బెంగాల్ నుంచి మమతా బెనర్జీ ఉన్నారు. మొత్తం 31 మంది సీఎంలలో 10 మంది ముఖ్యమంత్రుల విద్యార్హత గ్రాడ్యుయేషన్. ఇద్దరు సీఎంలు డాక్టరేట్ పొందారు.
ఇద్దరు ముఖ్యమంత్రులు బిలియనీర్లు
దేశంలోని మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సీఎంల సరాసరి ఆస్తి విలువ రూ.52.59 కోట్లుగా ఉందని ఏడీఆర్ పేర్కొంది. ఓవరాల్‌గా 31 మంది సీఎంల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లు ఉంది. మొత్తం సీఎంల ఏడాది సగటు ఆదాయం రూ.13,64,310 (13 లక్షల 64 వేల 3 వందల పది)గా ఉంది. 31 మంది ముఖ్యమంత్రుల్లో ఇద్దరు మాత్రమే బిలియనర్లుగా ఉన్నారు. ముగ్గురు సీఎంల ఆస్తులు రూ.50 కోట్ల కన్నా ఎక్కువగా ఉండగా, 9 మంది సీఎంల ఆస్తులు విలువ రూ.11 నుంచి రూ.50 కోట్ల మధ్య ఉన్నట్లు ఏడీఆర్ రిపోర్ట్ పేర్కొంది. ఇద్దరు సీఎంలు 70 నుంచి 80 ఏళ్ల మధ్య వయసు వారు కాగా, 12 మంది ముఖ్యమంత్రుల వయసు 51 నుంచి 60 మధ్యలో ఉంది. 31 మంది సీఎంలలో 10 మంది ముఖ్యమంత్రుల విద్యార్హత గ్రాడ్యుయేషన్. ఇద్దరు సీఎంలు డాక్టరేట్ పొందారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com