ప్రేమను వ్యతిరేకించిన పెద్దలు.. ప్రాణాలు తీసుకున్న ప్రేమికులు

ప్రేమను వ్యతిరేకించిన పెద్దలు.. ప్రాణాలు తీసుకున్న ప్రేమికులు
ఇంటర్ చదువుతున్న యువతీయువకులు ప్రేమించుకున్నారు.

ఇంటర్ చదువుతున్న యువతీయువకులు ప్రేమించుకున్నారు. వారి ప్రేమను పెద్దలు వ్యతిరేకించడంతో ప్రాణాలు తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాకు చెందిన ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించారనే నెపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దుబ్బాక మండలం లచ్చపేటలో కూరపాటి బగీరథ్ (17), తొట్ల నేహ (16) అనే ఇద్దరు యువకులు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

వీరిద్దరు దుబ్బాకలోని కళాశాలలో ఇంటర్ చదువుతున్నారు. తల్లిదండ్రులు తమ ప్రేమను వ్యతిరేకిస్తారనే భయం వారిలో నెలకొంది. దాంతో భగీరథ్ తల్లిదండ్రులు ఇంట్లోలేని సమయంలో నేహ అతడి ఇంటికి వెళ్లింది. అక్కడే తమ జీవితాలకు ముగింపు పలికారు. విషయం తెలుసుకున్న ఇరుకుటుంబాల తల్లిదండ్రులు బిడ్డల మృతదేహాలను చూసి బోరున విలపిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Read MoreRead Less
Next Story