Hanumakonda: ఒకేసారి రెండు ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్.. పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా..

Hanumakonda: ఒకేసారి రెండు ఉద్యోగాలు చేసి రిటైర్మెంట్.. పింఛను కోసం దరఖాస్తు చేసుకోగా..
Hanumakonda: జీతం సరిపోక రెండు ఉద్యోగాలు చేసేవాళ్లు చాలా మందే ఉంటారు.. ప్రైవేటు ఉద్యోగస్తులకైతే ఈ వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది..

Hanumakonda: జీతం సరిపోక రెండు ఉద్యోగాలు చేసేవాళ్లు చాలా మందే ఉంటారు.. ప్రైవేటు ఉద్యోగస్తులకైతే ఈ వెసులుబాటు ఎక్కువగా ఉంటుంది.. అయితే అది కూడా ఫుల్ టైమ్ చేయడానికి వీలవదు.. ఏ రెండు మూడు గంటలో పార్ట్ టైమ్ చేస్తుంటారు. కనీసం ఓ పదివేలు వచ్చినా ఖర్చులకు పనికొస్తాయని కష్టపడుతుంటారు.

కానీ ఇక్కడ అంటెడర్ రెండూ ప్రభుత్వ ఉద్యోగాలే చేశాడు.. మరి ఎలా మేనేజ్ చేశాడో ఏమో కానీ రిటైర్మెంట్ కూడా తీసుకున్నాడు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆ విషయాన్ని ట్రెజరీ అధికారులు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హనుమకొండ జిల్లా కిషన్‌పురాకు చెందిన ఎస్‌కే సర్వర్ రెండు వేర్వేరు తేదీల్లో పుట్టినట్టుగా సర్టిఫికెట్లు తీసుకొని ఒకటి కాకతీయ విశ్వవిద్యాలయంలో, మరొకటి పోలీసుశాఖలో పెట్టి అటెండర్ ఉద్యోగాలు చేసి కాలం గడిపేశాడు. పదవీ విరమణ వయసు దగ్గరపడడంతో రెండు చోట్లా రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇంతకాలం మేనేజ్ చేసిన వ్యక్తి పాపం పింఛను ఆఫీసులో దొరికిపోయాడు.

పింఛను కోసం డీటీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా అక్కడి అధికారులు పత్రాలను పరిశీలించారు. ఆ సమయంలో అతడు రెండు చోట్లా పని చేసిన విషయం బయటపడింది. దీంతో డీటీవో.. వరంగల్ సీపీ తరుణ్‌జోషీకి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. రెండు చోట్లా ఒకేసారి ఉద్యోగాలు ఎలా చేశాడనేది పోలీసుల విచారణలో తేలనుంది.

Tags

Read MoreRead Less
Next Story