Bhadradri-Kothagudem District: భారీ వర్షాలకు వణుకుతున్న ఏజెన్సీ ప్రాంతాలు.. ఉధృత ప్రవాహంలోనే పిల్లలు బడికి..

Bhadradri-Kothagudem District: భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎజెన్సీ ప్రాంతాలు వణికిపోతున్నాయి. చప్టా పైకి వరదనీరు చేరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో లక్ష్మిదేవిపల్లి మండలంలోని ఏడు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్నా.. గిరిజన ప్రాంతాల ప్రజల పరిస్థితి మాత్రం అధ్వాన్నంగా మారింది.
ఉధృతంగా ఉన్న ప్రవాహంలోనే సీతారాంపురం గ్రామ గిరిజనులు తమ పిల్లలను బడికి పంపాల్సి వస్తోంది. భయంభయంగా ప్రవాహం దాటుకుంటూ వెళుతున్నారు. చిన్నారులు స్కూల్‌కు వెళ్లి ఇంటికి చేరుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు. అత్యవసర సమయాల్లో గర్బిణీ స్త్రీలు, రోగులు ఆసుపత్రికి వెళ్లడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామాలకు ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పాఠశాల ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు రాలేని పరిస్థితి నెలకొంది. వంతెన నిర్మాణం చేయాలని ఎన్నిసార్లు వేడుకున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదంటూ మండిపడుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com