BJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అజెండాలు సిద్ధం..

BJP Meeting: బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో అజెండాలు సిద్ధమయ్యాయి.. రాజకీయ, ఆర్థిక పరమైన అంశాలతోపాటు విదేశాంగ విధానంపైనా అజెండాలు రూపొందించారు కమలనాథులు.. రాజకీయ అజెండాలో 2024లో దేశంలో మళ్లీ అధికారంలోకి రావడం, దక్షిణాదిన బలం పెంచుకోవడం వంటి కీలక అంశాలు ఉన్నాయి.. కర్నాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో చర్చించనున్నారు..
ఇక ఏపీ, తమిళనాడులో బలపడేందుకు వ్యూహాలపైనా సుదీర్ఘంగా చర్చిస్తారు.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా తీసుకోవాల్సిన కార్యాచరణపైనా చర్చించనున్నారు బీజేపీ నేతలు.. కేరళలో కార్యకర్తలను మనో ధైర్యం కల్పించాలని అజెండాలో నిర్ణయించారు. అటు ఉత్తరాదిన రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచించడంతోపాటు ఉత్తరాదిన తగ్గుతున్న ఎంపీ స్థానాలను సౌత్‌లో పెంచుకునే వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు.
ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆర్థిక అంశాలను కూడా ఎజెండాలో చేర్చారు.. దేధ ప్రజలు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై కమలనాథులు చర్చించనున్నారు.. అలాగే ప్రపంచంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా అవలంబించాల్సిన విధానంపై చర్చిస్తారు.. ఇతర దేశాలతో సంబంధాలపై ప్రభుత్వానికి సూచించాల్సిన అంశాలపైనా బీజేపీ చర్చించనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com