Shamshabad: శంషాబాద్‌లో రెచ్చిపోయిన యువకులు

Shamshabad: శంషాబాద్‌లో రెచ్చిపోయిన యువకులు
Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు హంగామా సృష్టించారు.

Shamshabad: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్ పోర్టు పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు హంగామా సృష్టించారు. రహదారి పక్కనే ఉన్న ఓ వివాదాస్పద స్థలంలోని నిర్మాణాలను కూల్చేశారు. తెల్లవారుజామునే సుమారు 50మంది వ్యక్తులు ఆ స్థలంలోకి ప్రవేశించి నిర్మాణాలను తొలగించినట్లు స్థానికులు తెలిపారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినట్లు ఆరోపించారు. వీడియోలు తీస్తున్న స్థానికులను భయబ్రాంతులకు గురి చేయడంతో పాటు సెల్ ఫోన్లు లాక్కురని వెల్లడించారు. ఇక జమాల్ అనే వ్యక్తి తన అనుచరులతో కలిసి దౌర్జన్యానికి దిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story