తెలంగాణలో అన్ని పరీక్షలు వాయిదా..!

తెలంగాణలో అన్ని  పరీక్షలు వాయిదా..!
కరోనా తీవ్రత కారణంగా అన్నీ యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లుగా ఉన్నత విద్యామండలి చైర్మెన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు.

తెలంగాణలో డీగ్రీ, పీజీ పరీక్షలు వాయిదా పడ్డాయి. కరోనా తీవ్రత కారణంగా అన్నీ యూనివర్సిటీల పరిధిలోని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లుగా ఉన్నత విద్యామండలి చైర్మెన్ పాపిరెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే పరీక్షల రీ షెడ్యుల్ ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా కరోనా తీవ్రత దృష్ట్యా ఈ రోజు నుంచి రాష్ట్రంలోని అన్నీ స్కూల్స్, కాలేజీలు యూనివర్సిటీల మూతపడ్డాయి. పరీక్షలను వాయిదా వేసేది లేదని నిన్న ప్రకటించగా, తల్లిదండ్రుల ఆందోళనతో తాజాగా వాయిదా వేశారు.

Tags

Next Story