TG: తెలంగాణ ఆవిర్భావ వేడుకులకు సర్వం సిద్ధం

TG: తెలంగాణ ఆవిర్భావ వేడుకులకు సర్వం సిద్ధం
X
అతిథిగా కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ... త్రివర్ణ పతాకం ఎగరేయనున్న సీఎం రేవంత్

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ కార్యక్రమాలను రేవంత్ సర్కార్ ఘనంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి జపాన్ లోని కితాక్యూషూ సిటీ మేయర్ కజుహిసా టకేచీ ముఖ్య అతిథిగా రానున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నేడు పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జిల్లాకు ఇంచార్జీలను నియమించింది.

పోలీస్ సేవా పతకాలు ప్రకటించిన ప్రభుత్వం..

తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసు సేవా పతకాలను ప్రకటించింది. ఈ మేరకు హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులకు వివిధ విభాగాల్లోని అందించిన సేవలకుగాను ఈ పతకాలు లభించాయి. పోలీసుశాఖలో పని చేసే గ్రేహౌండ్స్‌ విభాగానికి చెందిన తొమ్మిది మందికి శౌర్య పతకం అందగా, 16 మందికి మహోన్నత సేవా పతకం, 92 మందికి ఉత్తమ సేవా పతకం, 47 మందికి కఠిన సేవా పతకం, 461 మందికి సాధారణ సేవా పతకాలు లభించాయి. అవినీతి నిరోధక శాఖలో ఒకరికి మహోన్నత సేవా పతకం, నలుగురికి ఉత్తమ సేవా పతకం, మరో 17 మందికి సేవా పతకాలు దక్కాయి. విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి చెందిన ఒకరికి ఉత్తమ సేవా పతకం, మరో ఐదుగురికి సాధారణ సేవా పతకాలు అందాయి. డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఫైర్‌ సర్వీసులో ఇద్దరికి శౌర్య పతకం, ఒకరికి మహోన్నత సేవా పతకం, ముగ్గురికి ఉత్తమ సేవా పతకం, 14 మందికి సాధారణ సేవా పతకాలు దక్కాయి. స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ విభాగంలో ఒకరికి మహోన్నత సేవా పతకం, ముగ్గురికి ఉత్తమ సేవా పతకం, 15 మందికి సాధారణ సేవా పతకాలు లభించాయి.

పథకాల ఆరంభం

రాజీవ్​యువ వికాసం, గ్రామ పాలన అధికారులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు, ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవం లాంటి కార్యక్రమాలు చేపట్టబోతున్నది. అలాగే పలు ప్రభుత్వ కార్యక్రమాలు సైతం శ్రీకారం చుట్టునుంది. ఇందులో 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు ప్రారంభించనున్నది.

ఉద్యోగ నోటిఫికేషన్లు

తెలంగాణ రాష్ట్రంలో కొద్దిరోజులుగా కొంత నెమ్మదించిన కొత్త ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల ప్రక్రియ త్వరలో పునఃప్రారంభం కానుంది. ఈసారి కొత్తగా.. పక్కా ప్రణాళికతో ఉద్యోగార్థులకు తీపికబురు చెప్పనుంది. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించే పనిలో టీజీపీఎస్సీ కమిషన్‌, ఆయా సంస్థలు నిమగ్నమై ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రివైజ్డ్‌ జాబ్‌ క్యాలెండర్‌ లేదా కొత్త ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల విడుదలకు శ్రీకారం చుట్టనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tags

Next Story