ALLU ARJUN: పోలీసు విచారణకు అల్లు అర్జున్

అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నేడు(మంగళవారం) తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసులు సోమవారం సాయంత్రం ఆయనకు చేరాయి. సంధ్య ధియేటర్‌లో తొక్కిసాలట ఘటనపై నమోదైన కేసులో ఆయనను ప్రశ్నించనున్నారు. కోర్టుకు వెళ్లే ఉద్దేశం లేకపోతే ఉదయమే అల్లు అర్జున్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఒక వేళ తనకు కుదరకపోతే ఆయన మరింత సమయం కావాలని కోరే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం కేసు రాను రాను సున్నితంగా మారుతున్నందున .. మీడియా ఎదుట కూడా మాట్లాడినందున విచారణకు వెళ్లడమే మంచిదని ఆయన క్యాంప్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పోలీసుల ముందు హాజరైనా అర్జున్ కు అరెస్టు ముప్పు లేదు. ప్రశ్నించి పంపించేస్తారు. ఇదే కేసులో నాలుగు వారాల మధ్యంతబెయిల్ హైకోర్టు ఇచ్చింది. అప్పటి వరకూ పోలీసులు అరెస్టు చేయరు. అయితే విచారణకు హాజరు కాకుండా ఉంటే.. విచారణకు సహకరించడం లేదని దిగువకోర్టులో పోలీసులు వాదించే అవకాశం ఉంటుంది. అలాంటి చాన్స్ ఇవ్వకుండా పోలీసుల ఎదుట హాజరవుతారని అంటున్నారు.
వరుసగా 5 రోజులు విచారణకు అల్లు అర్జున్?
అల్లు అర్జున్ ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్నందున కేసు విచారణ కోసం పోలీసులు నేరుగా ఆయనకు నోటీసులు జారీ చేశారు. సాధారణంగా జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నప్పుడు కేసు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని, పోలీసులు నిందితుడిని కస్టడీకి తీసుకోవాలని నిర్ణయిస్తారు. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్‌లో ఉండడంతో ఆయనను 4 నుంచి 5 రోజులపాటు విచారించడానికి అవకాశం ఉన్నట్టు చర్చలు జరుగుతున్నాయి
ఏం జరిగిందంటే..?
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రోజున అల్లు అర్జున్ సంధ్యా ధియేటర్ లో సినిమా చూసేందుకు వెళ్లారు. ఆ రోజున తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు తొక్కిసలాట కారణంగా కోమాలోకి వెళ్లిపోయాడు. ఇప్పటికీ కోమాలో ఉన్నాడు. ఈ ఘటనలో అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయడంతో అదే రోజు బెయిల్ వచ్చింది. అయితే ఒక రోజు జైల్లో ఉండాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఈ ఇష్యూ రాజకీయంగానూ మారింది. అల్లు అర్జున్ తరపు లాయర్లతో పాటు అల్లు అర్జున్ కూడా పూర్తిగా పోలీసుల తప్పు వల్లే తొక్కిసలాట జరిగిందని ఆరోపిస్తున్నారు. అందుకే పోలీస్ కమిషనరే ఏకంగా ఆధారాలు బయట పెట్టారు.
ఎట్టకేలకు హై డ్రామాకు తెరపడింది ౧౧ గంటలకు తన లీగల్ టీంతో పాటు విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ సెషన్ కు వచ్చిన అల్లు అర్జున్
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com