AMARAVATHI: అమరావతి పనులు రయ్...రయ్

AMARAVATHI: అమరావతి పనులు రయ్...రయ్
X
అమరావతిలో పనులు వేగవంతం.. రాజధానిలో మంత్రి నారాయణ పర్యటన..త్వరలోనే మౌలిక వసతుల పనులు

అమ­రా­వ­తి­లో ని­ర్మాణ పను­లు వే­గ­వం­త­మ­య్యా­యి. అసెం­బ్లీ, హై­కో­ర్టు, సచి­వా­ల­యం, ట్రం­క్ రో­డ్ల పను­లు చు­రు­గ్గా సా­గు­తు­న్నా­యి. భూ­ము­లు ఇచ్చిన రై­తు­ల­కు రి­ట­ర్న­బు­ల్ ప్లా­ట్ల అభి­వృ­ద్ధి, గ్రా­మా­ల్లో మౌ­లిక సదు­పా­యాల కల్ప­న­పై దృ­ష్టి సా­రిం­చా­రు. మం­త్రి నా­రా­యణ పర్య­ట­న­లో భా­గం­గా వడ్డ­మా­ను­లో ప్ర­ధాన రహ­దా­రి­ని ప్రా­రం­భిం­చి, అమ­రా­వ­తి­ని ప్ర­పం­చం­లో­నే టాప్ 5 రా­జ­ధా­ను­ల్లో ఒక­టి­గా తీ­ర్చి­ది­ద్దు­తా­మ­ని తె­లి­పా­రు మం­త్రి నా­రా­యణ.

హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టులో.....

అమ­రా­వ­తి­లో ని­ర్మాణ పను­లు ఊపం­దు­కు­న్నా­యి. రా­జ­ధా­ని­లో ఎటు చూ­సి­నా వేల మంది కా­ర్మి­కు­లు, వా­హ­నా­లు, యం­త్రా­లు, భారీ ని­ర్మాణ సా­మ­గ్రి దర్శ­న­మి­స్తు­న్నా­యి. రా­జ­ధా­ని సచి­వా­ల­యం, అసెం­బ్లీ, హై­కో­ర్టు ఐకా­ని­క్‌ టవ­ర్స్, ట్రం­క్‌ రో­డ్లు, మం­త్రు­లు, ఎమ్మె­ల్యే­లు, కా­ర్య­ద­ర్శు­లు, ము­ఖ్య కా­ర్య­ద­ర్శు­లు, జడ్జి­లు, ఉద్యో­గు­లు, గె­జి­టె­డ్‌ అధి­కా­రు­లు, అఖిల భారత సర్వీ­సు అధి­కా­రుల భవన సము­దా­యాల పను­లు వే­గం­గా జరు­గు­తు­న్నా­యి. మరో వైపు రా­జ­ధా­ని ని­ర్మా­ణా­ని­కి భూ­ము­లు ఇచ్చిన రై­తుల రి­ట­ర్న­బు­ల్‌ ప్లా­ట్ల అభి­వృ­ద్ధి­కి శర­వే­గం­గా ఎల్‌­పీ­ఎ­స్‌ లే­ఔ­ట్‌ ని­ర్మాణ పను­లు చే­స్తు­న్నా­రు. ప్ర­స్తు­తం లే­ఔ­ట్‌­ల­లో జం­గి­ల్‌ క్లి­య­రె­న్స్‌ పను­ల­తో పాటు రో­డ్లు, సరి­హ­ద్దు రా­ళ్ల ఏర్పా­టు చేసే పను­లు చే­స్తు­న్నా­రు. ఏపీ ఎన్‌­ఆ­ర్‌­టీ, హ్యా­పీ­నె­స్ట్‌ ప్రా­జె­క్టు పను­లు చు­రు­గ్గా సా­గు­తు­న్నా­యి.

అమ­రా­వ­తి­లో ని­ర్మి­స్తు­న్న హ్యా­పీ నె­స్ట్‌ పను­లు వే­గం­గా జరు­గు­తు­న్నా­యి. పై­ల్‌ ఫౌం­డే­ష­న్‌ పను­లు పూ­ర్తి కా­వ­డం­తో బే­స్‌­మెం­ట్‌ ఏర్పా­టు చే­య­టం కోసం ప్ర­స్తు­తం కా­ర్మి­కు­లు ర్యా­ఫ్ట్‌ ఫౌం­డే­ష­న్‌ పను­లు చే­స్తు­న్నా­రు. ఈ ప్రా­జె­క్టు­ను 12 టవ­ర్స్‌­తో 2 బే­స్‌­మెం­ట్‌­లు, గ్రౌం­డ్‌ ఫ్లో­ర్‌+ 18 ఫ్లో­ర్‌­లు­గా ని­ర్మి­స్తు­న్నా­రు. ప్ర­తి ఫ్లో­ర్‌­కు 4 లేదా 6 ప్లా­ట్ల­ను ని­ర్మా­ణం చే­స్తు­న్నా­రు. మొ­త్తం 1200 ప్లా­ట్లు ని­ర్మిం­చ­ను­న్నా­రు. 29.23 లక్షల చద­ర­పు అడు­గుల వి­స్తీ­ర్ణం­లో హ్యా­పీ­నె­స్ట్‌ ప్రా­జె­క్టు­ను ని­ర్మిం­చ­ను­న్నా­రు. భూ­ము­లు ఇచ్చిన రై­తు­ల­కు సం­బం­ధిం­చి రి­ట­ర్న­బు­ల్‌ ప్లా­ట్ల అభి­వృ­ద్ధి­కి ఎల్‌­పీ­ఎ­స్‌ లే­అ­వు­ట్‌ ని­ర్మాణ పను­లు కూడా వే­గ­వం­తం అయ్యా­యి. జం­గి­ల్‌ క్లి­య­రె­న్స్‌ పను­ల­తో పాటు రో­డ్లు, సరి­హ­ద్దు రా­ళ్ల ఏర్పా­టు చేసే పను­లు చే­ప­ట్టా­రు. ఏపీ ఎన్ఆ­ర్టీ, హ్యా­పీ­నె­స్ట్ పను­లు ఊపం­దు­కు­న్నా­యి. హ్య­పీ­నె­స్ట్‌­కు పైల్ ఫౌం­డే­ష­న్ పను­ల్ని పూ­ర్తి­చే­సి బే­స్‌­మెం­ట్ కోసం ర్యా­ఫ్ట్ ఫౌం­డే­ష­న్ పను­లు చే­ప­ట్టా­రు.

మంత్రి నారాయణ పర్యటన

రా­జ­ధా­ని పరి­ధి గ్రా­మా­ల్లో మౌ­లిక వస­తు­లు కల్పిం­చే పను­ల­ను ము­మ్మ­రం చే­సి­న­ట్లు మం­త్రి నా­రా­యణ తె­లి­పా­రు. రూ.900 కో­ట్ల­తో అభి­వృ­ద్ధి పను­లు చే­ప­ట్టేం­దు­కు డీ­పీ­ఆ­ర్‌ సి­ద్ధం చే­సి­న­ట్లు చె­ప్పా­రు. ప్ర­భు­త్వం ఇప్ప­టి­కే ని­ధు­లు వి­డు­దల చే­సిం­ద­ని.. వచ్చే నె­ల­లో పను­లు ప్రా­రం­భి­స్తా­మ­న్నా­రు. 6 నె­ల­ల్లో గ్రా­మా­ల్లో­ని పను­ల­న్నీ పూ­ర్తి­చే­స్తా­మ­ని వి­వ­రిం­చా­రు. సో­మ­వా­రం వడ్డ­మా­ను­లో రహ­దా­రి­ని ప్రా­రం­భిం­చిన అనం­త­రం మీ­డి­యా­తో మం­త్రి మా­ట్లా­డా­రు. రా­జ­ధా­ని­ని గుం­టూ­రు, వి­జ­య­వాడ సహా పలు ప్రాం­తా­ల­కు అను­సం­ధా­నిం­చే రో­డ్డు పను­లు ము­మ్మ­రం­గా చే­స్తు­న్న­ట్లు మం­త్రి చె­ప్పా­రు. వె­స్ట్‌ బై­పా­స్‌­ను త్వ­ర­లో ప్రా­రం­భి­స్తా­మ­ని తె­లి­పా­రు. కర­క­ట్ట­కు సమాం­త­రం­గా సీ­ఆ­ర్‌­డీఏ రో­డ్డు­ను మం­గ­ళ­గి­రి రో­డ్డు­కు అను­సం­ధా­ని­స్తా­మ­న్నా­రు. దే­శా­ని­కి మాజీ ప్ర­ధా­ని వా­జ్‌­పే­యీ చే­సిన అపూ­ర్వ సే­వ­ల­ను స్మ­రిం­చు­కుం­టూ రా­జ­ధా­ని­లో ఆయన వి­గ్ర­హా­న్ని ఈనెల 25న ఆవి­ష్క­రి­స్తా­మ­ని చె­ప్పా­రు.

మరో­వై­పు మం­త్రి నా­రా­యణ రా­జ­ధా­ని­లో పర్య­టిం­చా­రు. వడ్డ­మా­ను­లో మం­త్రి­కి, స్థా­నిక ఎమ్మె­ల్యే శ్రా­వ­ణ్ కు­మా­ర్‌­తో కలి­సి ప్ర­ధాన రహ­దా­రి­ని ప్రా­రం­భిం­చా­రు. రై­తుల రి­క్వె­స్ట్‌­తో కే­వ­లం వారం రో­జు­ల్లో­నే ఈ రో­డ్డు ని­ర్మా­ణం పూ­ర్తి చే­శా­రు. అమ­రా­వ­తి ప్ర­పం­చం­లో టా­ప్‌5 లో ఉం­డే­లా ని­ర్మి­స్తు­న్నా­మ­న్నా­రు మం­త్రి నా­రా­యణ. ల్యాం­డ్ పూ­లిం­గ్ ద్వా­రా భూ­ము­లి­చ్చే రై­తు­ల­కు ఎలాం­టి ఇబ్బం­దు­లు లే­కుం­డా చే­స్తా­మ­న్నా­రు. గ్రా­మ­స్తు­లు అడి­గిన వెం­ట­నే వారం రో­జు­ల్లో­నే కొ­త్త రో­డ్డు ని­ర్మిం­చా­మ­న్నా­రు. 98.7 లక్ష­ల­తో 1148 మీ­ట­ర్ల రో­డ్డు­ను యు­ద్ధ­ప్రా­తి­ప­ది­కన ని­ర్మిం­చా­మ­ని తె­లి­పా­రు. రా­జ­ధా­ని­లో­ని 29 గ్రా­మా­ల్లో జన­వ­రి నుం­చి మౌ­లిక వస­తుల పను­లు చే­ప­డ­తా­మ­న్నా­రు మం­త్రి నా­రా­యణ. ఈ అభి­వృ­ద్ధి పను­లు రూ.900 కో­ట్ల­తో చే­ప­ట్టేం­దు­కు డీ­పీ­ఆ­ర్‌ సి­ద్ధ­మైం­ద­న్నా­రు. వచ్చే నె­ల­లో పను­లు ప్రా­రం­భిం­చి.. 6 నె­ల­ల్లో గ్రా­మా­ల్లో­ని పను­ల­న్నీ పూ­ర్తి­చే­స్తా­మ­న్నా­రు. అమ­రా­వ­తి­లో­ని అన్ని గ్రా­మా­ల్లో రో­డ్లు, అం­డ­ర్ గ్రౌం­డ్ డ్రై­నే­జీ, వరద నీటి కా­లు­వ­లు, వీధి లై­ట్లు ఏర్పా­టు చే­స్తా­మ­న్నా­రు మం­త్రి నా­రా­యణ. ఇన్న­ర్ రిం­గ్ రోడ్,స్పో­ర్ట్స్ సిటీ, రై­ల్వే లైన్, రై­ల్వే ట్రా­క్ కోసం ల్యాం­డ్ పూ­లిం­గ్ ద్వా­రా భూ­ము­లు తీ­సు­కుం­టా­మ­న్నా­రు. అమరావతిలో వీలైనంత త్వరగా నిర్మాణాలు చేపడతామన్నారు.

Tags

Next Story