Amazon: అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో డ్రగ్స్ అమ్ముతున్న వారికి నోటీసులు

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో డ్రగ్స్ విక్రయిస్తున్న వారికి నోటీసులు జారీ చేశారు అధికారులు. లైసెన్స్ లేకుండా డ్రగ్స్ అమ్ముతున్నట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఆన్ లైన్ లో ఔషధాలను అమ్ముతున్న వారికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (DCGI) షోకాజ్ నోటీసులను జారీచేసింది. 20మంది ఆన్ లైన్ విక్రేతలకు నోటీసులు అందినట్లుగా అధికారులు తెలిపారు. డీసీజీఐ విజి సోమాని ఫ్రిబ్రవరి 8 నాటి షోకాజ్ నోటీసులో లైసెన్స్ లేకుండా ఆన్ లైన్ మందుల అమ్మకాలను నిషేధిస్తూ డిసెంబర్ 12 2018నాటి హైకోర్టు ఉత్తర్వులను ఉదహరించారు.
నోటీసులు అందిన రెండు రోజుల్లో కారణాలను తెలియజేయాలని కోరుతున్నట్లు డీసీజీఐ స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఔషధాల విక్రయం, స్టాక్ ప్రదర్శన, పంపిణీ కోసం ఎందుకు చర్య తీసుకోరాదో తెలియజేయాలని డీసీజీఐ పేర్కొంది. 1940 కింద రూపొందిన నియమాలను నోటీసులో అధికారులు పేర్కొన్నారు. ఏదైనా ఔషధం యొక్క విక్రయం, స్టాక్ ప్రదర్శన, ఆఫర్ చేసేందుకు సంబంధిత రాష్ట్ర లైసెన్స్ అథారిటీ నుండి లైసెన్స్ అవసరం అని అధికారులు తెలిపారు. విక్రయదారులనుంచి ఎటువంటి సమాదానం రాకపోతే, తదుపరి నోటీసులు లేకుండానే అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com