Amit Shah: తెలంగాణపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. రంగంలోకి అమిత్ షా..

Amit Shah (tv5news.in)

Amit Shah (tv5news.in)

Amit Shah: తెలంగాణలో పట్టుబిగించేందుకు బీజేపీ అన్ని అవకాశాల్నీ సద్వినియోగం చేసుకుంటోంది.

Amit Shah: తెలంగాణలో పట్టుబిగించేందుకు బీజేపీ అన్ని అవకాశాల్నీ సద్వినియోగం చేసుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఏర్పడేది తమ ప్రభుత్వమే అని బీజేపీ నేతలు చెబుతున్నా.. అది అంత సులువేం కాదు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, అభ్యర్థుల గుర్తింపు.... బీజేపీ ముందున్న ప్రధాన సవాళ్లు. ప్రతికూల పరిస్థితులు ఎలా ఉన్నా... ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటంలో బీజేపీ చురుగ్గా పాల్గొంటుూ వస్తోంది.

ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ నిత్యం జనాల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. అటు అధిష్టానం కూడా రాష్ట్ర నాయకత్వానికి అన్ని విధిలుగా అండగా ఉంటామనే హామీ ఇస్తోంది. ముఖ్యంగా కేంద్రమంత్రి అమిత్‌షా తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. పార్టీ కేడర్ బలోపేతంతో పాటు కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేయాలని రాష్ట్ర నాయకత్వానికి సూచిస్తూ వస్తున్నారు.

తెలంగాణలో బీజేపీ బలోపేతంతో పాటు కేడర్‌లో జోష్‌ను నింపేందుకు కేంద్ర మంత్రి అమిత్‌షా రాష్ట్రానికి రాబోతున్నారు. ఏప్రిల్లో రెండుసార్లు అమిత్‌షా తెలంగాణలో పర్యటిస్తారు. ముందుగా ఏప్రిల్‌ 1న అమిత్‌షా వస్తారని బీజేపీ నేతలు చెబుతున్నారు. తిరిగి శ్రీరామనవమి రోజు భద్రాచలానికి వస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీరామనవమి సందర్భంగా సీతారామస్వామి వార్లకు అమిత్‌షా పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెబుతున్నారు.

అదే రోజు సాయంత్రం హైదరాబాద్‌ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని చెబుతున్నారు. తర్వాత పలువురు మేధావులతో హైదారాబాద్‌లో అమిత్‌షా భేటీ అవుతారని సమాచారం. అంతేకాకుండా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న పలువురు నేతలతో భేటీ అవుతారని తెలుస్తోంది. ఏప్రిల్‌ 14న గద్వాల జోగులాంబ ఆలయం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రెండో విడత పాదయాత్ర నిర్వహిస్తున్నారు.

దీన్ని ప్రారంభించేందుకు అమిత్‌ షా వస్తారని నేతలు చెబుతున్నారు. ఒకవేళ ఆరోజు వీలుకాకపోతే ఏదో ఒకరోజు పాదయాత్రలో ఆయన పాల్గొంటారని తెలుస్తోంది. అలాగే, జనగామలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అమిత్‌షా హాజరవుతారని సమాచారం. నాలుగు రాష్ట్రాల్లో అద్భుత ఫలితాల ఉత్సాహంతో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణను టార్గెట్‌ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటి నుంచి తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టేందుకు సమాయత్తం అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story