Amit Shah: నేడు హైదరాబాద్‌కు అమిత్ షా.. ముచ్చింతల్‌లోని రామానుజ విగ్రహ సందర్శన..

Amit Shah (tv5news.in)
Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఇవాళ హైదరాబాద్ రానున్నారు. ముచ్చింతల్‌లోని రామానుజ విగ్రహాన్ని సందర్శించనున్నారు. సాయంత్రం 4.40 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు అమిత్ షా. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ముచ్చింతల్ వెళ్లనున్నారు. శ్రీరామనగరంలోని 108 దివ్యక్షేత్రాలు సందర్శించనున్న అమిత్ షా.. యాగశాల పూజల్లో పాల్గొననున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి రాత్రి 8 గంటలకు ఢిల్లీకి తిరుగుపయనం కానున్నారు అమిత్ షా.
ఆధ్మాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకున్న ముచ్చింతల్ భక్త జనసంద్రంగా మారింది. రామానుజ విగ్రహాన్ని సందర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తరలివస్తున్నారు. సమతకు చిహ్నమైన రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహ వేడుకల్లో పాల్గొనేందుకు ఈనెల 13న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రానున్నారు. ముగింపు వేడుకల సందర్భంగా ఈ దివ్యక్షేత్రాన్ని రాష్ట్రపతి సందర్శించనున్నారు.
కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కూడా రానున్నారు. త్వరలోనే ఆయన శ్రీరామనగరంలో పర్యటించనున్నారు. ఇప్పటికే గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముచ్చింతల్‌ను సందర్శించారు. సోమవారం నిర్వహించిన వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కూడా పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com