Telangana BJP: నేడు ఖమ్మంలో బీజేపీ భారీ బహిరంగ సభ

Telangana BJP: నేడు ఖమ్మంలో  బీజేపీ భారీ బహిరంగ సభ

ఖమ్మంలో ఇవాళ బీజేపీ భారీ బహిరంగ నిర్వహిస్తోంది. రైతు గోస-బీజేపీ భరోసా నినాదంతో నిర్వహిస్తోన్న ఈ సభ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు బీజేపీ నేతలు. నగరంలో SR &BGNR డిగ్రీ కాలేజ్ మైదానంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు బీజేపీ అగ్రేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. హాజరుకానున్నారు. ఈ సభకు లక్ష మంది జనం హాజరవుతారని అంచనా వేస్తున్నారు బీజేపీ నేతలు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న తొలి బహిరంగ సభ కావడంతో... బీజేపీ వర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇందుకోసం భారీగా జనసమీకరణ చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లా, నల్గొండ జిల్లాలతో పాటు హైదరాబాద్ నుంచి బహిరంగ సభకు జనాన్ని తరలిస్తున్నారు. ఇందుకోసం దాదాపు వెయ్యి బస్సులు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. వీటితోపాటు కార్లు, ట్రక్కులు, ట్రాలీ ఆటోల్లోనూ జనాలను తరలిస్తున్నారు. ఇక... వర్షాకాలం కావడంతో బహిరంగ సభకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా ...ప్రత్యేకంగా వాటర్ ప్రూఫ్ షెడ్లు ఏర్పాటు చేశారు.

తెలంగాణలో వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పాగా వేయాలని లక్ష్యంతో నిర్వహిస్తున్న బహిరంగ సభ వేదిక నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు అమిత్ షా. రైతు డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పట్ల బీజెపి వైఖరిపై స్పష్ట ఇచ్చే అవకాసం ఉంది. బహిరంగ సభ ద్వారా బీజేపీ నేతలకు , కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు అమిత్‌షా, ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్న 2 గంటల 50 నిమిషాలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 3 గంటల 30 నిమిషాలకు ఖమ్మం చేరుకుంటారు 3 గంటల 40 నిమిషాలకు సభా ప్రాంగణానికి చేరుకుని...సాయంత్రం 4 గంటల 35 నిమిషాలకు వరకు పాల్గొంటారు. సభ ముగిసిన అనంతరం 4 గంటల 40 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు రాష్ట్రస్థాయి నేతలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. అనంతరం హెలికాప్టర్ ద్వారా తిరిగి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్ట్ కు చేరుకుంటారు.

Tags

Next Story