అమిత్ షా రోడ్ షో

X
కేంద్ర హోంమంత్రి అమిత్ షా... బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. ఆయనకు స్వాగతం పలికేందుకు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, ఎంపీ అరవింద్ సహా పలువురు నేతలు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. చార్మినార్ దగ్గర భాగ్యలక్ష్మీ అమ్మవారికి అమిత్ షా పూజలు చేసి ప్రచారం నిర్వహిస్తారు. షా పర్యటన నేపథ్యంలో పాతబస్తీలో కేంద్ర బలగాలు మోహరించాయి.
ఉదయం 11 గంటల 45 నిమిషాలకు వారాసిగూడ నుంచి సీతాఫల్‌మండి హనుమాన్ టెంపుల్ వరకు అమిత్ షా రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత మధ్యహ్నం బీజేపీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతలతో చర్చిస్తారు. ఎన్నికలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు తిరిగి ఢిల్లీకి బయలుదేరుతారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
