Telangana BJP: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన అమిత్‌షా

Telangana BJP: బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన అమిత్‌షా

ఖమ్మం రైతు గోస- బీజేపీ భరోసా సభలో బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు అమిత్‌షా. కేసీఆర్‌ సర్కార్‌కు కౌంట్‌ డౌన్‌ మొదలైందన్నారు. ఈ సారి కేసీఆర్‌, కేటీఆర్‌ ముఖ్యమంత్రి కాబోరు.. భవిష్యత్‌ సీఎం బీజేపీ నుంచే అవుతారని చెప్పారు. కాంగ్రెస్‌ ఫోర్‌ జీ, బీఆర్‌ఎస్‌ త్రీజీ, మజ్లిస్‌ టూజీ పార్టీలని విమర్శించారు. కారు స్టీరింగ్‌ మజ్లిస్‌ చేతుల్లో ఉందని విమర్శించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒకటేనన్న ఖర్గే కామెంట్స్‌కు అమిత్‌షా కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ ఎట్టి పరిస్థితిలో బీఆర్‌ఎస్‌తో కలవబోదని క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్‌ను ఇంటికి పంపి బీజేపీ సర్కార్‌ను తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై అమిత్‌షా ఫైర్ అయ్యారు. ఆ రెండు పార్టీలు కుటుంబ పార్టీలంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్‌ సోనియా కుటుంబం కోసం.. బీఆర్‌ఎస్‌ కేసీఆర్‌ కుటుంబం కోసం పనిచేస్తోందన్నారు. ఉద్యమకారుల ఆకాంక్షలను కేసీఆర్‌ నీరుగార్చారని విమర్శించారు. తెలంగాణ పోరాట యోధులను విస్మరించారని మండిపడ్డారు. కేసీఆర్‌ ప్రభుత్వానికి నూకలు చెల్లాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోతుంది.. కమలం వికాసిస్తుందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు.

బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు వేసినట్టే: కిషన్ రెడ్డి

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ కుటుంబ పార్టీలేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే కాంగ్రెస్‌కు ఓటేసినట్టేనని అన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ దేనికి ఓటేసినా మజ్లిస్‌కు ఓటేసినట్టేనని అన్నారు. కేసీఆర్‌ పాలనలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి వచ్చిందన్నారు. ధరణి కారణంగా లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఎన్నికలకు ముందు తూతూ మంత్రంగా రైతు రుణాలు మాఫీ చేస్తున్నారని విమర్శించారు. తొమ్మిదేళ్లుగా కేసీఆర్‌ సర్కారు పంటల బీమా పథకం అమలు చేయట్లేదన్నారు.

రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు: ఈటల

సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. నాలుగేళ్లుగా రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారని ఆరోపించారు. ఎన్నికల ముందు హైదరాబాద్‌ భూములను అమ్మి రుణమాఫీ చేస్తున్నారని చెప్పారు. రైతులకు ఇవ్వాల్సిన అనేక సబ్సిడీలను కేసీఆర్‌ ప్రభుత్వం ఎత్తేసిందన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే వాటిని పునరుద్దరిస్తామని చెప్పారు. బంగారు తెలంగాణ మాటల్లోనే ఉందని.. చేతల్లో లేదని ఈటల ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు.


Tags

Read MoreRead Less
Next Story