ఖమ్మంలో రైతు గోస- బీజేపీ భరోసా సభ

ఖమ్మంలో రైతు గోస- బీజేపీ భరోసా సభ


తెలంగాణలో బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించబోతోంది. ఖమ్మం గుమ్మంలో భారీ బహిరంగ సభకు కమలదళం సర్వం సిద్ధం చేసింది. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభాస్థలికి చేరుకోనున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అమిత్ షా.. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో ఖమ్మం చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కేడర్‌కు దిశా నిర్దేశం చేయనున్నారు అమిత్‌షా. రైతు గోస- బీజేపీ భరోసా నినాదాన్ని వినిపించనున్నారు. ఖమ్మం సభలో అమిత్ షా రైతు డిక్లరేషన్ ప్రకటించే అవకాశం ఉంది.

ఖమ్మం SR & BGNR డిగ్రీ కాలేజ్‌ గ్రౌండ్‌కు భారీగా బీజేపీ కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు. తెలంగాణలో పాగా వేయాలని పట్టుదలగా ఉన్న కమలదళం... ఖమ్మం సభను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరిపై అమిత్‌షా క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. బహిరంగ సభ తర్వాత ముఖ్యనేతలతో అమిత్‌షా సమావేశం కానున్నారు. రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చంచనున్నారు.

Tags

Next Story