అమిత్ షా రాకతో తెలంగాణలో పెరగనున్న ఎలక్షన్ హీట్

తెలంగాణలో ఎన్నికల పోరుకు బీజేపీ సన్నద్ధమవుతోంది.. ఇందులో భాగంగా ఈనెల 27న రాష్ట్రంలో పర్యటించనున్నారు అమిత్ షా....ఖమ్మం సభ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.. వాస్తవానికి గత నెలలోనే అమిత్ షా ఖమ్మం రావాల్సి ఉంది.. కానీ ఆయన పర్యటన మూడుసార్లు వాయిదా పడింది.. ఈసారి అమిత్ షా టూర్ కన్ఫామ్ కావడంతో బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.. అమిత్ షా పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు శుక్రవారం తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి ఖమ్మం వెళ్లనున్నారు.
అమిత్ షా పర్యటనతో బీజేపీ శ్రేణుల్లో కొత్త జోష్ వస్తుందని కమలం పార్టీ నేతలు భావిస్తున్నారు.. అమిత్ షా ఖమ్మం సభలో పలువురు నేతలు బీజేపీలో చేరతారని తెలుస్తోంది.. కిషన్‌రెడ్డి రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి తెలంగాణకు అమిత్ షా వస్తుండటంతో సభను విజయవంతం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.. మరోవైపు ఇప్పటికే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతలు జిల్లాల్లో పర్యటిస్తుండగా.. అమిత్ షా రాకతో తెలంగాణలో ఎన్నికల హీట్ పెరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com