Sangareddy: ఆటోపై యువకుడి స్టంట్లు.. షాకిచ్చిన ట్రాఫిక్ పోలీసులు..

X
By - Divya Reddy |29 Jun 2022 6:42 PM IST
Sangareddy: సినిమా సీన్ తరహాలో వెళ్తున్న ఆటోపై నిలుచొని ఓ యువకుడు హల్‌చల్ చేశాడు.
Sangareddy: సినిమా సీన్ తరహాలో వెళ్తున్న ఆటోపై నిలుచొని ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. తీరా ఆ విషయం పోలీసులకు తెలియడంతో ఆటోకు ఫైన్ విధించారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ర్యాలమడుగు గ్రామానికి చెందిన సాయిలుకు ఆటో ఉంది. అయితే.. నారాయణఖేడ్‌లో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఆటోను డేంజరస్‌గా నడపడమే కాకుండా ఓ యువకుడిని ఆటోపై ఎక్కించి వీడియో తీసి వాట్సప్‌లో షేర్ చేశాడు. అది కాస్తా పోలీసుల వరకు చేరింది. దీంతో ఆటోకు 16వందల 35 రూపాయల ఫైన్ విధించారు. రోడ్లపై ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకునేది లేదని పోలీసులు హెచ్చరించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com