Anam Mirza Dawat E Ramzan: నగర వాసులకు ఆనమ్ మిర్జా దావత్

Anam Mirza Dawat E Ramzan: నగర వాసులకు ఆనమ్ మిర్జా దావత్
X
భర్తతో కలిసి మరోసారి దావత్ ఏ రంజాన్ కు ఆనమ్ మిర్జా భారీ ఏర్పాట్లు....

టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా సోదరి ఆనమ్ మిర్జా వ్యాపారవేత్తగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. గతేడాది పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని ఆనమ్ ఏర్పాటు చేసిన దావత్ ఎ రంజాన్ కు భారీ స్పందన లభించడంతో, ఈ ఏడాది కూడా భర్త అసదుద్దీన్ తో కలసి ఈ దావత్ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మహదీపట్నంలోని కింగ్స్ ప్యాలెస్ లో అబన్డీస్ అనే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ను నిర్మిస్తోన్న ఆత్రియా గ్రూప్ తో కలసి సంయుక్తంగా ఈ సారి 'దావత్ ఎ రంజాన్'ను ఏర్పాటు చేయబోతోంది. ఏప్రిల్ 7 నుంచి మొదలుకుని ఏప్రిల్ 21 వరకూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు నిర్వహకులు ప్రకటించారు.

Tags

Next Story