Bhadradri Kothagudem District: నాన్నే మాపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

Bhadradri Kothagudem District: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కొత్తమలుపు తిరుగుతోంది. ఆత్మహత్యలకు ముందు రామకృష్ణ రాసిన సూసైడ్ నోట్ ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులు స్వాధీనం చేసుకున్న లేఖలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రామకృష్ణ ఆత్మహత్యకు తల్లి సూర్యవతి, అక్క మాధవి.
కొత్తగూడెం MLA వనమా వెంకటేశ్వరరావు కుమారుడు రాఘవ కారణమంటూ సూసైడ్ నోట్‌లో రాసిన వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వనమా రాఘవతో తన అక్కకు అక్రమసంబంధం నేపథ్యంలోనే.. చావాలని నిర్ణయించుకున్నామని సూసైడ్ నోట్‌లో రాసుంది. సూసైడ్ నోట్ ఆధారంగా వనామా రాఘవ, సూర్యవతి, మాధవిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
పాల్వంచ తూర్పు బజారులోని రామకృష్ణ, శ్రీలక్ష్మి దంపతులు, తమ కవల పిల్లలతో సహా ఆత్మహత్యకు యత్నించారు. రామకృష్ణ దంపతులతోపాటు కవలల్లో ఓ కూతురు సజీవ దహనమయ్యారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలు కావటంతో కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
వంటగ్యాస్ లీక్ కావడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గరు సజీవదహనం అయినట్లుగా మొదట భావించారు. అయితే నాన్నే మాపై కిరోసిన్ పోసి నిప్పింటించాడని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ చిన్నారి పోలీసులకు తెలిపింది. చిన్నారి చెప్పిన ఆధారలతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అటు రామకృష్ణ కుటుంబం సజీవదహనం కేసులో తనకెలాంటి సబంధం లేదని వనమా రాఘవ స్పష్టం చేశారు. సూసైడ్ నోట్ ఆధారంగా రాఘవపై ఐపీసీ సెక్షన్ 306 కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న రాఘవ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం అన్ని విషయాలు వెల్లడించనున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com