AP TS Projects : జలకళ సంతరించుకున్న తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులు..

AP TS Projects : జలకళ సంతరించుకున్న తెలుగు రాష్ట్రాల ప్రాజెక్టులు..
AP TS Projects : ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు 43 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది

AP TS Projects : ఏపీ, తెలంగాణలోని ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. జూరాల ప్రాజెక్టుకు 43 వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. శ్రీశైలానికి లక్షా 40వేల క్యూసెక్కులు నమోదవుతోంది. అటు.. శ్రీశైలం నుంచి ఇన్‌ఫ్లో వస్తుండటంతో నాగార్జునసాగర్‌ నీటిమట్టం వేగంగా పెరుగుతుంది. 83వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కాగా.. 35వేల క్యూసెక్కులు దిగువకు వదిలారు.

సాగర్‌ పూర్తిస్థాయి నీటిమట్టం ప్రస్తుతం 574 అడుగులకు చేరింది. కర్నూలు జిల్లా సుంకేశుల ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద వస్తోంది. దీంతో ఆ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. తుంగభద్ర నుంచి దిగువకు నీరు వదిలారు. సుంకేశుల ఇన్‌ఫ్లో లక్షా 10వేల క్యూసెక్కులుగా ఉంది. 27 గేట్లను ఎత్తారు అధికారులు. ఇక.. పులిచింతలలో 40 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది.

గోదావరి బేసిన్‌లోని శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టుకు 40వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. నాలుగు వరద గేట్ల ద్వారా 16వేల 656 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువకు వదులుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ బరాజ్‌కు వరద పోటెత్తింది. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదీ ప్రవాహం పెరిగి బరాజ్‌లోకి వరద పెరుగుతూ వస్తుంది.

నిన్న 4లక్షల 96వేల క్యూసెక్కులకు పెరిగింది. దీంతో బరాజ్‌లోని 85 గేట్లను ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక.. ధవళేశ్వరం బ్యారేజ్‌కి వచ్చే ప్రవాహం పెరిగింది. ఇక్కడి నుంచి డెల్టాకు 6వేల 900 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 4లక్షల 68వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. భద్రాచలం వద్ద 6లక్షల క్యూసెక్కులకు పైగా నీరు వస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story