AP CID : ఏపీ మాజీ సీఐడీ డీజీపై చర్యలు తీసుకోండి : కేంద్రం

AP CID : ఏపీ మాజీ సీఐడీ డీజీపై చర్యలు తీసుకోండి : కేంద్రం
సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా వ్యవహరించిన ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ సీఐడీ డీజీ

ఆంధ్ర ప్రదేశ్‌ మాజీ సీఐడీ డీజీపై చర్యలు తీసుకోవాలని సీఎస్‌కు ఆదేశాలు అందాయి. ఈ అంశంపై ఏపీ సీఎస్‌కు కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. నిభందనలు, సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు వ్యతిరేకంగా సునీల్‌ వ్యవహరించారని కేంద్ర హోంశాఖకు హైకోర్టు న్యాయవాది గూడపాటి లక్ష్మీ నారాయణ ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర హోంశాఖ వేంటనే చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎస్‌ను ఆదేశించింది.

సీఐడీ డీజీ ఉన్న సమయంలో సునీల్‌ పై పలు విమర్శలు ఉన్నాయి. పోలీస్‌ అధికారిలా కాకుండా అధికార పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారంటూ పలు ఆరోపణలు వచ్చాయి. అంతే కాకుండా మత పరమైన అంశాల్లో కూడా సునీలు తన పరిమితులు దాటి వ్యవహరించార్న విమర్శలు కూడా ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story