తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ టీడీపీ నేతల లేఖ..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ టీడీపీ నేతల లేఖ..!
X

తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ... ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవి, ఏలూరు సాంబశివరావు, డోల బాల వీరాంజనేయ స్వామి లెటర్‌ పంపించారు. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతులు లేవని కేంద్రానికి, కృష్ణాబోర్డుకు ఫిర్యాదు చేయడాన్ని వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను కోరారు. ఈ ప్రాజెక్టు అంశం కేంద్రం గెజిట్‌లో రాకపోవడం ఏపీ ప్రభుత్వ వైఫల్యమని తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

Next Story