AP, TS : ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే అనిల్ సేమ్ ట్వీట్స్

AP, TS : ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే అనిల్ సేమ్ ట్వీట్స్

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ చేసిన ట్వీట్లు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ట్వీట్లను అస్త్రంగా మలుచుకుని విపక్షాలు సోషల్‌ మీడియాలో సెటైర్లు పేల్చుతున్నాయి.. ఈ ఇద్దరు నేతల ట్వీట్లు ఇంత వివాదాస్పదం కావడానికి అందులో ఉన్న కంటెంటే కారణం.. టెన్త్ పరీక్షల ప్రారంభం సందర్భంగా వారు.. విద్యార్థులను విష్ చేస్తూ ట్వీట్లు పెట్టారు. ఇందులో ఎవరు ముందు ట్వీట్‌ చేశారో తెలియదుగానీ.. ఇద్దరి ట్వీట్లలో అక్షరం పొల్లు పోకుండా ఒకటే కంటెంట్‌ ఉండటంతో విపక్షాలు రచ్చ చేస్తున్నాయి.. జీవితంలో ఉన్నత చదువులకు తొలి మెట్టు అనే పదం నుంచి.. ఆల్‌ ది బెస్ట్‌ వరకు సేమ్‌ టు సేమ్‌ ఉన్నాయి.

ఇలా ఒకే టెక్ట్స్‌తో ట్వీట్స్ పెట్టడంపై నెటిజన్లలో అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. సాధారణంగా రాజకీయ నేతలు తమ ట్విట్టర్ అకౌంట్లను నిర్వహించేందుకు ప్రత్యేకమైన ఏజెన్సీలను నియమించుకుంటారు. ఎలాంటి ట్వీట్లు పెట్టాలన్నది నేతలు చెబితే వారు పోస్ట్‌ చేస్తారు.. అయితే, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ఇద్దరు పెట్టిన పోస్టులు ఒకటే కావడంతో దీని వెనుక ఐప్యాక్‌ హ్యాండ్‌ ఉందని విపక్షాలు అంటున్నాయి.
తెలంగాణలో బీఆర్ఎస్ నేతలకు.. ఏపీలో వైసీపీకి ఐప్యాక్ సోషల్ మీడియా సర్వీస్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్ల టార్గెట్‌గా విపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇప్పుడీ ట్వీట్లపై పెద్ద చర్చ జరుగుతోంది.

Tags

Next Story