గాంధీ భవన్‌లో నిన్నటితో ముగిసిన దరఖాస్తుల పక్రియ

గాంధీ భవన్‌లో నిన్నటితో ముగిసిన దరఖాస్తుల పక్రియ

తెలంగాణ కాంగ్రెస్‌లో టికెట్ల కోసం ఫుల్‌ డిమాండ్ ఉంది. గాంధీ భవన్‌లో నిన్నటితో దరఖాస్తుల పక్రియ ముగిసింది. ఆశావాహుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చి పడ్డాయి. 119 నియోజకవర్గాల నుంచి మొత్తం ఒక వెయ్యి 20 దరఖాస్తులు వచ్చాయి.

కొడంగల్, మంథని నుంచి మాత్రం ఒక్కొక్క దరఖాస్తు వచ్చింది. మిగిలిన నియోజకవర్గాల్లో పదుల సంఖ్యలో అప్లకేషన్లు వచ్చాయి. రిజర్వుడ్‌ నియోజకవర్గాల్లోనూ పుల్ డిమాండ్ ఉంది. అత్యధికంగా ఇల్లెందు సెగ్మెంట్ నుంచి 38 దరఖాస్తులు వచ్చాయి. దేవరకొండ టికెట్ కోసం జానారెడ్డి ఇంటికి ఎస్టీ నేతలు క్యూ కడుతున్నారు. ఇక్కడ బాలు నాయక్ ప్లేస్‌లో రమేష్‌ నాయక్, కిషన్‌ నాయక్‌ పేర్లు విన్పిస్తున్నాయి.

మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్‌ హుస్నాబాద్‌కు, మధుయాష్కి ఎల్బీనగర్‌కు దరఖాస్తు చేశారు. సీనియర్‌ నేతలు జానారెడ్డి, మల్లురవి, గీతారెడ్డి, వీహెచ్ మాత్రం దరఖాస్తు చేయలేదు. అటు.. రేపటి నుంచి దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కానుంది. ముందు పీసీసీ ఎన్నికల కమిటీ వడపోత అనంతరం.. స్క్రీనింగ్‌ కమిటీకి అభ్యర్థుల జాబితా వెళ్లనుంది.

Tags

Next Story