అందుబాటు ధ‌ర‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకండి..

అందుబాటు ధ‌ర‌లో ఇల్లు కొనాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం చేయకండి..

'ఇల్లు కట్టి చూడు-పెళ్ళి చేసి చూడు' అంటుంటారు పెద్దలు. ఈ రెండు పనులు చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. అందుకే సామాన్యుడు సొంతింటి కలను సాకారం చేసుకోవాలన్న తపనతో అతి కష్టం మీద ఆర్థిక వనరుల్ని దాచిపెడతారు. అయితే 'ఉద్యోగ భద్రత ఉన్న వాళ్లు.. అదనంగా డబ్బు ఉన్న వాళ్లు.. ఓ ఇల్లు కొనాలని అనుకునే వారికి ఇది సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆలస్యమయ్యే కొద్దీ ధరలు సామాన్య, మధ్యతరగతి వాసులు అందుకోలేనంతగా పెరిగిపోతున్నాయి.

కరోనా ప్రభావంతో ప్రపంచ దేశాలు విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. లాక్ డౌన్ విధించడంతో అన్ని రంగాలు మూతపడ్డాయి. ముఖ్యంగా ఈ కరోనా ఎఫెక్ట్ రియాల్టీ రంగంపై అధికంగా ప్రభావం చూపిస్తుంది. ఇక రానున్న రోజుల్లో స్థిరాస్తుల ధరలు సామాన్య, మధ్యతరగతి వాసులు అందుకోలేనంతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రియల్‌‌ ఎస్టేట్‌‌ ధరలు తగ్గాల్సి ఉంది. కాని కొన్ని చోట్ల విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఇల్లు, ప్లాట్లు అమాంతం పెరిగిపోయాయి. అయితే అందుబాటు ధరల్లో కొనగలిగే నిర్మాణాల లభ్యత తగ్గింది. రూ.45 లక్షల బట్జెట్‌లో ఇంటికోసం ఎక్కువ మంది చూస్తున్నారు. మరి ఈ బట్జెట్‌లో ఇల్లు రావలంటే అవుటర్‌ దాకా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతదూరం వెళ్లినా ఛాయిస్‌ తక్కువగా ఉంటుంది. ఈ బట్జెట్‌లో తక్కువ మంది బిల్డర్లు కడుతున్నారు.

అయితే ఇన్నర్‌ రింగ్‌రోడ్డు బయట మొన్నటివరకు అందుబాటు ధరల్లో డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్లు దొరికేవి. ఐదు నుంచి పది కిలోమీటర్ల లోపలికి వెళితే అదే ధరకు ఇండిపెండెంట్ హౌస్ వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇన్నర్‌ రింగ్‌రోడ్డు బయట ప్రాంతాల్లో ఇండిపెండెంట్ హౌస్ రూ.80 లక్షల వరకు చెబుతున్నారు. ఇక అపార్ట్‌మెంట్ల ధర రూ.50 లక్షల వరకు పలుకుతున్నాయి. ఇక రూ.40లక్షల నుంచి రూ.45 లక్షల ధరలో ఇల్లు కావాలంటే అవుటర్‌ వరకు వెళ్లాల్సిన పరిస్థితి.

వెస్ట్ హైదరాబాద్‌లోని బీరంగూడ వంటి ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఫ్లాట్లు వస్తున్నాయి. ఈస్ట్ హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌, ఘట్‌కేసర్‌ వరకు వెళ్లితే అందుబాటు ధరల్లో ప్లాట్లు లభ్యమవుతాయి. సౌత్ హైదరాబాద్‌లోని శంషాబాద్‌లో మాత్రమే ఈ ధరకు ఫ్లాట్‌ వస్తుంది. ఈ ప్రాంతాల్లోనూ గేటెడ్‌ కమ్యూనిటీల్లో అయితే ఇంకా ఎక్కువే అవుతోంది. నార్త్ హైదరాబాద్‌లోని ప్రాంతాల్లో ఇంటి ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. బొల్లారం, అల్వాల్‌, సైనిక్‌పురి వంటి తదితర ప్రాంతాల్లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయి.

ఇక ఉద్యోగం, పిల్లల చదువుల దృష్ట్యా అవుటర్‌ వరకు వెళ్లలేనివారు ఇన్నర్‌రింగ్‌రోడ్డు చేరువలో పాత ఫ్లాట్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఐదేళ్ల నుంచి పదేళ్ల క్రితం నిర్మాణమైన అపార్ట్‌మెంట్లు ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. మెహిదీపట్నం నుంచి అత్తాపూర్‌, కర్మన్‌ఘాట్‌, నాగోల్‌, సికింద్రాబాద్‌ వరకు రూ.45లక్షల నుంచి 50లక్షల్లో పాతఫ్లాట్లు విక్రయానికి ఉన్నాయి. మరొవైపు ప్రభుత్వం కూడా అందుబాటు ధరల గృహాలకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.

Tags

Next Story