SIT: సుప్రీం అంటే మీరేనా..కేసీఆర్‌ను ప్రశ్నించిన సిట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను సిట్ సుదీర్ఘంగా విచారించింది. నందినరగ్లోని నివాసంలో సుమారు 4 గంటల 45 నిమిషాలకుపైగా అధికారులు కేసీఆర్‌ను విచారించారు. ఇదివరకూ విచారించిన వారు పేర్కొన్న అంశాలపై అధికారులు గులాబీ బాస్‌ను ప్రశ్నించినట్టు సమాచారం. విచారణ మొత్తాన్ని అధికారులు ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. కేసీఆర్‌కు రెండోసారి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు ఆదివారం విచారణ పూర్తి చేశారు. నందినగర్‌లోని నివాసం రెండో అంతస్తులోని గదిలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణ మొదలైంది. నాలుగ్గంటల 45 నిమిషాల విచారణ అనంతరం కేటీఆర్, హరీశ్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లతో కేసీఆర్ మాట్లాడారు.
కీలక ప్రశ్నలు
విచారణలో భాగంగా అధికారులు పలు కీలక ప్రశ్నలు అడిగినట్లు తెలిసింది. ‘సుప్రీం, పెద్దాయన’ ఆదేశాల మేరకు ఫోన్ ట్యాపింగ్ చేశామంటూ ఈ కేసులో కీలక నిందితులు ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావు స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని సిట్ అధికారులు కేసీఆర్ ముందు ప్రస్తావించినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సుప్రీం, పెద్దాయన అంటే మీరేనా అని కేసీఆర్‌ను ప్రశ్నించినట్లు తెలిసింది. రిటైర్డ్ అయిన అధికారులను ఎందుకు పదవుల్లో కొనసాగించారు.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధకిషన్ రావుతో మీరెప్పుడైనా మాట్లాడారా.. ఒకవేళ మాట్లాడితే ఏ అంశాలపై మాట్లాడారు.. ఫోన్ ట్యాపింగ్ డేటాను మీకు ఎవరూ అందజేశారు వంటి అంశాలపై సిట్ అధికారులు కేసీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపించినట్లు సమాచారం. ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించిన వీడియోలు మీకు ఎవరు ఇచ్చారని ప్రశ్నించినట్లు తెలిసింది. నందినగర్ నివాసంలో కేసీఆర్‌ను ఆరుగురు అధికారుల బృందం ప్రశ్నించింది. గతంలో సాక్షుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించారు. కేసీఆర్ ఎదుట అందుకు సంబంధించిన ఆధారాలు ఉంచి ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై ఆడియోలు ఎలా వచ్చాయనే అంశంపై సిట్ సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణని ముగించుకున్న అనంతరం కేసీఆర్ నివాసం నుంచి సిట్ అధికారులు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఆదేశాలు ఎవరి సూచనలతో జారీ అయ్యాయనే విషయంపై, నిర్ణయ ప్రక్రియలో కేసీఆర్ పాత్రపై సిట్ అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ ఎప్పటినుంచి మొదలైంది..
ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలు జారీ చేశారా..? అని కేసీఆర్‌ని నేరుగా ప్రశ్నించారు. ‘ఫోన్ ట్యాపింగ్ చేయమని ఇంటెలిజెన్స్ అధికారులకు మీరు స్వయంగా ఆదేశాలు జారీ చేశారా?’ అనే ప్రశ్నను స్పష్టంగా అడిగినట్లు సమాచారం. ఈ అంశంపై కేసీఆర్ నుంచి క్లారిటీ తీసుకునేందుకు సిట్ అధికారులు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలిసింది. ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ మొదలైంది..? అనే విషయాలపై సిట్ అధికారులు ప్రత్యేకంగా ఆరా తీశారు. ‘ఏ సంవత్సరం నుంచి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పారు?, అది సాధారణ భద్రత కోసమా..? లేక రాజకీయ అవసరాల కోసమా..?’ అంటూ పలు ప్రశ్నలు వేసినట్లు సమాచారం. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేశారా..?.. వారి ఫోన్లు ట్యాప్ చేయమని ఆదేశాలు ఇచ్చారా..? అంటూ సిట్ అధికారులు నేరుగా ప్రశ్నించారని సమాచారం. ఈ ప్రశ్నలపై కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు ఈ కేసులో తమ దర్యాప్తునకు కీలకంగా మారనున్నాయని సిట్ అధికారులు భావిస్తున్నారు.
ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు వ్యవహారం కూడా సిట్ అధికారుల విచారణలో ప్రధాన అంశంగా మారింది. పదవీకాలం ముగిసిన ప్రభాకర్‌రావుకు మళ్లీ పదవిని ఎందుకు పొడిగించారు..? ఆ నిర్ణయం వెనుక కారణాలు ఏంటి..? అంటూ కేసీఆర్‌ను సిట్ అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు..?, పరిపాలనా నియమావళికి విరుద్ధంగా ఒకే వ్యక్తికి రెండు కీలక బాధ్యతలు అప్పగించడంపై కూడా సిట్ అధికారులు ప్రశ్నలు సంధించారు. ఒకే వ్యక్తికి రెండు కీలక పోస్టులు ఎందుకు అప్పగించారు..?, అది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో సంబంధం ఉందా..? అనే కోణంలో సిట్ విచారణ కొనసాగినట్లు సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
