తెలంగాణ

Army Jawan : గుండెపోటుతో ఆర్మీ జవాన్‌ మృతి.. సుడాన్‌ దేశంలో సేవలందిస్తూ

Army Jawan : అదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్‌.... సుడాన్‌ దేశంలో సేవలందిస్తూ గుండెపోటుతో మృతి చెందారు

Army Jawan : గుండెపోటుతో ఆర్మీ జవాన్‌ మృతి.. సుడాన్‌ దేశంలో సేవలందిస్తూ
X

Army Jawan : అదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్‌.... సుడాన్‌ దేశంలో సేవలందిస్తూ గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఇచ్చోడ మండలంలోని అతని సొంతూరు నర్సాపూర్‌లో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆర్మీలో నర్సింగ్‌ విభాగంలో విధులు నిర్వహిస్తున్న సంజీవ్‌... కొంతకాలంలో సుడాన్‌ దేశంలో సేవలందిస్తున్న భారత ఆర్మీ బృందాల్లో సభ్యునిగా ఉన్నారు. అక్కడి ఇండియన్‌ ఫీల్డ్‌ హాస్పిట్‌లో విధులు నిర్వహిస్తున్న క్రమంలో సంజీవ్‌ గుండెపోటుతో మరణించినట్లు ఆర్మీ సమాచారం ఇచ్చింది. దీంతో అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జవాన్‌ సంజీవ్‌ మృతదేహాన్ని సొంతూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తోంది ఇండియన్‌ ఆర్మీ.

Next Story

RELATED STORIES