MEETING: చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ అత్యవసర సమావేశం

హైదరాబాద్‌లో సినిమా పైరసీ రాకెట్‌పై నగర పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ నేపథ్యంలో, సినీ పరిశ్రమ పెద్దలతో హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశంలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, అక్కినేని నాగార్జున, నాని, నాగచైతన్య, రామ్ పోతినేని, దగ్గుబాటి సురేష్ బాబు, దిల్ రాజు పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణకు ఆహ్వానం అందినా ఆయన హాజరుకాలేదు.
సినిమా ఇండస్ట్రీని పట్టిపీడిస్తున్న భూతం పైరసీ.. కొత్త సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం పాపం.. గంటల వ్యవధిలో సినిమాలను పైరసీ చేస్తున్నారు కొంతమంది కేటుగాళ్లు. కాగా దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. సినిమా రిలీజ్ కాకముందే సర్వర్ లను హ్యాక్ చేసి వీడియో ను గేమింగ్ సైట్ లో అప్లోడ్ చేస్తుంది ఈ ముఠా. ఈ ముఠాలోని కీలక నిందితుడు ఇంటర్మీడియట్ వరకే చదివాడని తెలుస్తుంది. అలాగే నిందితుడికి ప్రాఫిట్ అంతా డాలర్ లోనే ఉందని పోలీసులు తెలిపారు.
రూ.22 వేల కోట్ల నష్టం
తెలుగు తో సహా పలు భాషలు సినిమాలు పైరసీ చేస్తున్నట్లు పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వల్ల ఇప్పటికే అన్ని భాషల సినిమా ఇండస్ట్రీకి దాదాపు రూ.22 వేల కోట్ల నష్టం కలిగించినట్టు అంచనా వేస్తున్నారు. ఇందులో టాలీవుడ్ కు 3,700 కోట్ల నష్టం వాటిల్లింది. 18 నెలల్లో 40కి పైగా తెలుగు, హిందీ, తమిళ సినిమాలు విడుదల రోజునే లీక్ చేశారు. హ్యాష్ ట్యాగ్ సింగిల్ సినిమా పైరస్ చేసినట్లు ఇచ్చిన ఫిర్యాదు ద్వారా గతంలో వనస్థలిపురానికి చెందిన కిరణ్ ను అరెస్ట్ చేశారు. నిందితుడిని జూలై 3న అరెస్ట్ చేశారు. కిరణ్ కస్టడీలోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు రాబట్టారు . సినిమా పైరసీ గ్యాంగ్ గత 18 నెలల్లో 40కి పైగా తెలుగు, హిందీ, తమిళ సినిమాలను విడుదల రోజునే రికార్డు చేసి ఆన్లైన్లో లీక్ చేసినట్లు విచారణలో బయటపడింది.
కీలక విషయాలు వెల్లడించిన సీవీ ఆనంద్
ముఠా కార్యకలాపాల వల్ల కేవలం తెలుగు ఇండస్ట్రీకే సుమారు రూ. 3,700 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ఈ ముఠా అత్యంత పకడ్బందీగా, ఆధునిక టెక్నాలజీని వాడుతూ పైరసీకి పాల్పడినట్లు విచారణలో తేలింది. థియేటర్లలోకి వెళ్లే ఏజెంట్లు పాప్‌కార్న్ డబ్బాలు, చొక్కా జేబులు, కూల్ డ్రింక్ టిన్లలో హై-ఎండ్ కెమెరాలు పెట్టి సినిమాలను చిత్రీకరించేవారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ స్క్రీన్ లైట్ కూడా ఆఫ్ అయ్యేలా ప్రత్యేక యాప్‌లను ఉపయోగించడంతో ఎవరికీ అనుమానం వచ్చేది కాదని పోలీసులు తెలిపారు. కొన్నిసార్లు థియేటర్లకు శాటిలైట్ ద్వారా పంపే కంటెంట్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కూడా హ్యాక్ చేసి ఒరిజినల్ ప్రింట్లను దొంగిలించినట్లు సీపీ వివరించారు.
తొలి రోజే రికార్డింగ్
పైరసీ ముఠా దుబాయ్, నెదర్లాండ్, మయన్మార్‌లో ఉన్నట్లుగా గుర్తించామని తెలిపారు. ప్రముఖ తెలుగు మీడియా ఛానల్ ఈటీవీ విన్ కంటెంట్‌ను కూడా నిందితులు పైరసీ చేసి అమ్ముకున్న హర్షవర్ధన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. రికార్డు చేసిన కంటెంట్‌ను ఇతర వెబ్సైట్లకు విక్రయిస్తూ పైరసీ ముఠా సొమ్ము చేసుకుంటుందని తెలిపారు. ముఖ్యంగా ఓటీటీ కంటెంట్‌ను ఐబొమ్మ, బప్పం టీవీ సహా పలు ప్లాట్‌ఫామ్‌లకు విక్రయిస్తున్నట్లుగా గుర్తించామని అన్నారు. థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్ కంటెంట్ ఐడీ, పాస్‌వర్డ్‌లను కూడా క్రాక్ చేస్తున్నట్లుగా నిర్ధారించామని తెలిపారు. ముఖ్యంగా ఏజెంట్లను అడ్డం పెట్టుకుని ఎవరికీ ఎక్కడా అనుమానం రాకుండా కంటెంట్‌ను నేరగాళ్లు రికార్డు చేయిస్తున్నారని అన్నారు. కొత్త సినిమా విడుదలైన మొదటి రోజే ఏజెంట్లకు ముఠా ఫస్ట్ షో టికెట్లు బుక్ చేసి హై రిజల్యూషన్ రికార్డింగ్ ఎక్విప్మెంట్ను ఇచ్చి ఫుటేజీ తీసుకుంటున్నారని తెలిపారు. థియేటర్లలో రహస్యంగా ఎలా రికార్డు చేయాలో ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారని వెల్లడించారు. ఓ నిందితుడికి బెట్టింగ్ యాప్ నుంచి నెలకు దాదాపు రూ.9 లక్షల వరకు చెల్లింపులు జరిగినట్లుగా గుర్తించామని అన్నారు. క్రిప్టో కరెన్సీ పేమెంట్స్ ద్వారా కొంత కేసులో క్లూ దొరికిందని తెలిపారు. ఆ క్లూతో ఈ కేసులో కీలక నిందితులను అరెస్ట్ చేశామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com