కొడుకు మృతదేహంతో కడసారి కేక్‌ కటింగ్‌

కొడుకు మృతదేహంతో కడసారి కేక్‌ కటింగ్‌
కొడుకు పుట్టిన రోజు అంటే ఎంతో వేడుకగా జరుపుతారు తల్లిదండ్రులు. బెలూన్ల డెకోరేషన్, కేక్ కటింగ్, స్నేహితుల శుభాకాంక్షలు

కొడుకు పుట్టిన రోజు అంటే ఎంతో వేడుకగా జరుపుతారు తల్లిదండ్రులు. బెలూన్ల డెకోరేషన్, కేక్ కటింగ్, స్నేహితుల శుభాకాంక్షలు, పెద్దల ఆశీర్వాదాలతో సంతోషంగా జరుపుకుంటారు. కానీ అనంత లోకాలకు వెళ్లిన కుమారుడి జన్మదిన వేడుకలు జరిపారు ఓ తల్లిదండ్రులు. ఈ హృదయ విదారక ఘటన కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలోని బాబాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. 10వ తరగతి విద్యార్థి సీహెచ్ సచిన్ గురువారం గుండెపోటుతో చనిపోయాడు. అయితే మరుసటి రోజే సచిన్ పుట్టిన రోజు కావడంతో అతనికి పుట్టిన రోజు వేడుకలు జరిపారు తల్లిదండ్రులు. మృతి చెందిన సచిన్ చేతితో నిన్నరాత్రి 12 గంటలకు కేక్ కట్ చేయించి జన్మదిన వేడుకలను జరిపించారు. ఉద్వేగభరితమైన ఈ ఘటనతో తల్లి దండ్రులతో పాటు బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.

Tags

Next Story