QWAISI: ప్రధాని మోదీపై ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు

QWAISI: ప్రధాని మోదీపై ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు
X
వక్ఫ్‌ బిల్లుపై మోసం చేస్తున్నారని మండిపాటు

ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకుని బీజేపీ పని చేస్తోందని ఆరోపించారు. మసీదులు ధ్వంసం, ముస్లింల ఇళ్లు కూల్చడం, వక్ఫ్ బిల్లుతో మోసం చేస్తోందని మండిపడ్డారు. వక్ఫ్ బిల్లు ముస్లింలకు మేలు చేస్తుందన్న ప్రధాని వ్యాఖ్యలు బట్టతలకు జుట్టు వచ్చే మందులాంటి వాగ్దానాలేనని సెటైర్లు వేశారు. హైదరాబాద్‌లో వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా జరిగిన సభలో పాల్గొన్న ఒవైసీ, బీజేపీ న్యాయవ్యవస్థను బెదిరిస్తోందని అన్నారు. కోర్టులను కాపాడుకోకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని హెచ్చరించారు. వక్ఫ్ బిల్లును తిప్పి పంపే వరకు దేశవ్యాప్తంగా శాంతియుతంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Tags

Next Story