Assam CM : హైదరాబాద్ నిమజ్జనోత్సవంలో అస్సాం సీఎం హేమంత్ బిస్వ శర్మకు చేదు అనుభవం..

Assam CM : హైదరాబాద్ నిమజ్జనోత్సవంలో అస్సాం సీఎం హేమంత్ బిస్వ శర్మకు చేదు అనుభవం..
X
Assam CM : అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ హైదరాబాద్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది

Assam CM : అస్సోం సీఎం హిమంత బిశ్వ శర్మ హైదరాబాద్ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. హైదరాబాద్ MJ మార్కెట్ దగ్గర గణేష్ నిమజ్జనం వేదికపై హిమంత బిశ్వ మాట్లాడేందుకు ప్రసంగిస్తుండగా..గోషామహల్‌ టీఆర్ఎస్ కార్యకర్త నంద కిషోర్ బిలాల్‌ మైక్ లాక్కునేందుకు ప్రయత్నించారు. దీంతో వెంటనే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు నంద కిషోర్‌ను కిందకు లాక్కెళ్లారు.

ఈ ఘటనతో అక్కడి బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు టీఆర్ఎస్ కార్యకర్త నందకిషోర్‌ను అరెస్టు చేశారు. నంద కిషోర్‌ అరెస్టుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసనకు దిగారు.బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు.

తెలంగాణలో ఒకే కుటుంబానికి మంచి జరుగుతోందన్నారు హిమంత బిశ్వ శర్మ. రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు మంచి జరగాలని భగవంతున్ని కోరకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రజల కోసం పని చేయాలని కానీ..కుటుంబం కోసం కాదన్నారు. తెలంగాణలో రజాకార్ల పాలనను అంతమొందించాలన్నారు. అంతకుముందు ఛార్మీనార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఐతే అక్కడే ప్రసంగించేందుకు హిమంత బిశ్వ యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

ఇక అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మపై దాడిని ఖండించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ప్లాన్ ప్రకారమే దాడి జరిగిందన్నారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరగడం దారుణం అన్నారు. టీఆర్ఎస్‌ నేతలు సంస్కార హీనులంటూ మండిపడ్డారు.

ఐతే హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలను ఖండించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. నిమజ్జనానికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వేదికపై అలాంటి వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ఇలా మాట్లాడితే కార్యకర్తలు కాదు..ప్రజలు తిరగబడతారన్నారు.

ఇక MJ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలోనూ రెండు పార్టీల మద్య వివాదం తలెత్తింది. మంత్రి తలసాని అనుచరులతో గణేష్ ఉత్సవ సమితి సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఉత్సవ సమితి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పక్కనే తలసాని ఫ్లెక్సీ వెలసింది. మంత్రి తలసాని ఫ్లెక్సీ ఏర్పాటుపై గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మంత్రి తలసాని ఫ్లెక్సీ తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది.

Tags

Next Story