Assembly Session: అన్నపూర్ణగా తెలంగాణ : గవర్నర్ తమిళిసై

తెలంగాణ ఎనిమిదన్నరేళ్లలో అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని అన్నారు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవడంతో... ఉబయ సభలను ఉద్దేశించి మాట్లాడారు. 'పుట్టుక నీది చావునీది బతుకంతా దేశానిది' అని నినదించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు మాటలతో ప్రసంగాన్ని మొదలుపెట్టారు గవర్నర్. దేశానికే తెలంగాణ రోల్ మాడల్ గా నిలిచిందన్నారు. వ్యవసాయం, సాగునీరు, ప్రజా సంక్షేమం, గ్రామీన, పారిశ్రామికంగాలలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని వివరించారు.
వ్వయసాయ రంగంలో తెలంగాణ చరిత్ర సృష్టించిందని తెలిపారు గవర్నర్. నాణ్యమైన ఉచిత విద్యుత్ ను రైతులకు అందించడం ద్వారా దిగుబడి పెరిగిందన్నారు. నీటి లభ్యత వలన పంటల సాగు పెరిగిందన్నారు. దేశానికి అన్నపూర్ణగా తెలంగాణ అవతరించిందన్నారు. దళిత బంధు ద్వారా ప్రతి దళితుడికి 10లక్షల చొప్పున ఇస్తూ వారి అభ్యున్నతికి ప్రభుత్వం దొహదపడుతుందన్నారు. ఉద్యోగాల భర్తీ, విద్య వైద్యం, ఐటీ అభివృద్దితో పాటు పలు రంగాలలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు గవర్నర్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com