Assembly Session: గవర్నర్ ప్రసంగం... తప్పుల తడక : ఈటల

X
By - Vijayanand |3 Feb 2023 5:02 PM IST
భూప్రక్షాళన పేరుతో ధరణి అని హడావుడి చేసిన ప్రభుత్వం.. ఇవాళ గవర్నర్ స్పీచ్‌లో ధరణి ప్రస్తావనే తేలేదని ఎద్దేవా చేశారు
గవర్నర్ ప్రసంగం అంతా తప్పుల తడకేఅని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. గవర్నర్‌తో సీఎం కేసీఆర్ ప్రభుత్వం అబద్దాలు చెప్పించిందన్నారు. వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ అనేది అవాస్తవమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 6 గంటల కరెంట్ కూడా రావడం లేదని విమర్శించారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు ట్రాన్స్‌ఫార్మర్లు వద్ద ధర్నాలు చేస్తున్నారని తెలిపారు.
దేశంలోనే భూప్రక్షాళన పేరుతో ధరణి అని హడావుడి చేసిన ప్రభుత్వం.. ఇవాళ గవర్నర్ స్పీచ్‌లో ధరణి ప్రస్తావనే తేలేదని ఎద్దేవా చేశారు. ఎస్ఐ, కానిస్టేబుళ్ల ఉద్యోగాల కోసం 2 నెలలుగా నిరసనలు చేస్తున్నారని గుర్తుచేశారు. తెలంగాణలో ఆత్మహత్యల పరంపర కొనసాగుతోందని ఈటల రాజేందర్ అన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com