మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం

మాజీ ప్రధాని పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... అసెంబ్లీలో సీఎం కేసీఆర్ తీర్మానం ప్రవేశపెట్టారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా.. పీవీకి కేంద్రం భారత రత్న ఇవ్వాలన్నారు కేసీఆర్. పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, నూతన ఆర్థిక సంస్కరణలు చేపట్టారని కేసీఆర్ కొనియాడారు. పీవీకి సరైన గౌరవం దక్కలేదన్నారు. ఆత్మగౌరవ పతాక అయిన పీవీ శతజయంతి ఉత్సవాల్లో... ఆయన దేశానికి చేసిన సేవల్ని ప్రజలంతా స్మరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోందన్నారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందడానికి, ఆర్థిక వ్యవస్థలో పురోగమించడానికి పీవీనే కారణమన్నారు. ప్రధాని పదవి చేపట్టే అదృష్టం తెలంగాణ ముద్దుబిడ్డకు ఎంతో గౌరవన్నారు కేసీఆర్. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక గమనాన్ని మార్చారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల ఫలితాలను నేడు మనం అనుభవిస్తున్నామని కేసీఆర్ తెలిపారు.
పీవీ నిరంతర సంస్కరణ శీలి అని మంత్రి కేటీఆర్ అన్నారు. పీవీ భూ సంస్కరణలకు నాందిపలికారని తెలిపారు. 51 దేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తోందన్నారు. సమైక్య పాలనలో పీవీలాంటి మేధావులు మరుగునపడ్డారని కేటీఆర్ పేర్కొన్నారు.
పీవీకి భారత రత్న ఇవ్వాలన్న తీర్మానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మద్దతు తెలిపారు. మాజీ ప్రధాని పీవీకి బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నారు. పీవీ అపర చాణక్యుడని కీర్తించారు. అణుపరీక్షలు దాంది పలికారని భట్టి అన్నారు.
అయితే పీవీకి భారత రత్న ఇవ్వాలన్న తీర్మానాన్ని MIM వ్యతిరేకించింది. సోమవారం BAC సమావేశంలోనూ.. ఇదే అంశంపై తన వ్యతిరేకతను తెలిపారు మజ్లిస్ నేతలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com