వైఎస్‌ఆర్ అనుచరుడు సూరీడుపై అల్లుడి దాడి..!

వైఎస్‌ఆర్ అనుచరుడు సూరీడుపై అల్లుడి దాడి..!
జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి బలవంతంగా ప్రవేశించి సూరీడిపై క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేసాడు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచరుడు సూరీడుపై అల్లుడు దాడి చేశాడు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో అల్లుడు సురేంద్రనాథ్‌రెడ్డి బలవంతంగా ప్రవేశించి సూరీడిపై క్రికెట్‌ బ్యాట్‌తో దాడి చేసాడు. కూతురిని వేధిస్తున్నారని గతంలో సురేంద్రనాథ్‌రెడ్డిపై గృహహింస కేసు పెట్టించారు సూరీడు. అయితే గృహహింస కేసును ఉపసంహరించుకోవడం లేదని మామ అయిన తన తండ్రిపై సురేంద్రనాథ్‌రెడ్డి కక్ష పెంచుకున్నాడని సూరీడు కూతురు ఆరోపించింది.

మరోసారి ఇదే కేసు విషయంలో సూరీడి నివాసానికి వెళ్లాడు సురేంద్రనాథ్‌రెడ్డి. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విచక్షణ మరిచిన సురేంద్రనాథ్‌రెడ్డి సూరీడుపై క్రికెట్‌ బ్యాట్‌తో దాడికి పాల్పడ్డాడు. సూరీడు కూతురు గంగా భవానీ ఫిర్యాదుతో సురేంద్రనాథ్‌రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. గతేడాది కూడా తన తండ్రిపై సురేంద్రనాథ్‌రెడ్డి దాడికి పాల్పడ్డారని సూరీడు కూతురు గంగా భవానీ తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story