Vikarabad: అడ్రస్ లేని డ్యూటీ డాక్టర్.. మద్యం మత్తులో ఉన్న అటెండర్ వైద్యం..

Vikarabad: అడ్రస్ లేని డ్యూటీ డాక్టర్.. మద్యం మత్తులో ఉన్న అటెండర్ వైద్యం..
Vikarabad: వికారాబాద్‌ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో.. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు.

Vikarabad: వికారాబాద్‌ జిల్లా పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలో.. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 30 పడకల ఆసుపత్రిలో ఒక్క నర్స్‌ మాత్రమే డ్యూటీలో ఉంది. ఆసుపత్రికి ఛాతినొప్పితో ఓ బాధితుడు.. డెలివరీ కోసం ఓ గర్భిణి వచ్చినా పట్టించుకునే నాథుడే కరువయ్యారు. డ్యూటీ డాక్టర్‌ ఆచూకీ లేదు. మద్యం మత్తులో ఉన్న అటెండర్‌ డాక్టర్‌గా మారి వైద్యం అందిస్తున్నాడు.

డాక్టర్‌ లేనప్పుడు మేమేం చేయాలంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. చాతి నొప్పితో వచ్చిన పేషెంట్‌కు తూతూ మంత్రంగా టెస్టులు చేసి.. డాక్టర్‌ కన్సెల్టెన్సీ లేకుండానే వేరే ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా జరిగి వెలుగులోకి వచ్చినప్పటికీ ఆస్పత్రి సిబ్బంది తీర్పు రాకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story