Avula Subba Rao: సికింద్రాబాద్‌ అల్లర్ల సూత్రధారి సుబ్బారావే.. పక్కా ఆధారాలు లభ్యం..

Avula Subba Rao: సికింద్రాబాద్‌ అల్లర్ల సూత్రధారి సుబ్బారావే.. పక్కా ఆధారాలు లభ్యం..
Avula Subba Rao: సికింద్రాబాద్‌ అల్లర్ల సూత్రధారి సుబ్బారావే అని తేల్చారు సెంట్రల్ ఇంటలిజెన్స్, ఐటీ అధికారులు.

Avula Subba Rao: సికింద్రాబాద్‌ అల్లర్ల సూత్రధారి సుబ్బారావే అని తేల్చారు సెంట్రల్ ఇంటలిజెన్స్, ఐటీ అధికారులు. విద్యార్థుల్ని రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పినట్లు పక్కా ఆధారాలు సేకరించారు. సెంట్రల్ ఇంటలిజెన్స్ విచారణలో కీలక విషయాలు బయటికొచ్చాయి. దేశవ్యాప్తంగా 9 బ్రాంచ్‌లు నడుపుతున్న సుబ్బారావు.. ఆర్మీ కోచింగ్ పేరుతో 2 లక్షల ఫీజ్ వసూల్‌ చేస్తున్నాడు.

విడతల వారీగా పేమెంట్స్ చెల్లించేలా అభ్యర్థుల్ని ఆకర్షించాడు. తనవద్ద శిక్షణ తీసుకుంటే జాబ్‌ గ్యారెంటీ అంటూ హామీలిచ్చాడు. మొదట రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లిస్తే చాలు.. ఆర్మీకి సెలెక్ట్ అయ్యాకే మిగతా మొత్తం చెల్లించండంటూ కొటేషన్లిచ్చాడు. గ్యారెంటీ కింద అభ్యర్థుల టెన్త్ మెమోలు దగ్గర పెట్టుకుంటూ వచ్చాడు సుబ్బారావు. ఇప్పటివరకు అంతా బాగానే ఉన్నా అగ్నిపథ్‌తో కథ అడ్డం తిరిగింది.

ఆస్కీంతో సుబ్బారావుకు ఊహించని షాక్‌ తగిలింది. తన దగ్గర శిక్షణ తీసుకుంటున్న చాలామంది విద్యార్థులు అప్పటికే ప్రాథమిక పరీక్ష పూర్తి చేసుకున్నారు. రిటెన్ ఎగ్జామ్ క్లియర్ చేస్తే పెద్దమొత్తంలో ఫీజులు వచ్చేవి. కానీ అగ్నిపథ్‌ స్కీం ప్రకటించిన కేంద్రం రాత పరీక్ష లేదని అనడంతో సుబ్బారావు 50 కోట్లు నష్టపోయాడు. ఆగ్రహంతో రగిలిపోయి ఎలాగైనా అభ్యర్థులను రెచ్చగొట్టి.. రాతపరీక్ష నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ప్లాన్ వేశాడు.

పక్కా ప్లాన్‌ ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో విధ్వంసంకు కార్యాచరణ రచించాడు సుబ్బారావు. వాట్సప్ గ్రూపులు క్రియేట్ చేసి మరీ 800 మంది అభ్యర్థులను రెచ్చగొట్టాడు. విధ్వంసంలో పాల్గొన్న సాయి అకాడమీ అభ్యర్థులకు భోజన, వసతి ఏర్పాటు చేశాడు. మూడు రోజుల పాటు సుబ్బారావును విచారించిన సెంట్రల్ ఇంటలిజెన్స్, ఐటీ అధికారులు ఈ కీలక విషయాలు బయటపెట్టారు. విచారణ ముగియడంతో అతన్ని తెలంగాణ పోలీసులకు అప్పగించారు.

Tags

Read MoreRead Less
Next Story