AZHAR: అజారుద్దీన్‌కు మైనార్టీ శాఖేనా..?

AZHAR: అజారుద్దీన్‌కు మైనార్టీ శాఖేనా..?
X
మైనార్టీ లేదా హోంశాఖ ఇస్తారంటూ విస్తృత ప్రచారం

అజా­రు­ద్దీ­న్ రా­క­తో తె­లం­గాణ కే­బి­నె­ట్‌­లో మం­త్రుల సం­ఖ్య 15కు చే­రిం­ది. ఆయ­న­కు ఏ శా­ఖ­లు కే­టా­యి­స్తా­ర­నే చర్చ నడు­స్తోం­ది. ప్ర­స్తు­తా­ని­కి చాలా శా­ఖ­లు ము­ఖ్య­మం­త్రి వద్దే ఉన్నా­యి. మై­నా­ర్టీ సం­క్షే­మం, వి­ద్యా, హోం­శాఖ అన్నీ కూడా రే­వం­త్ తన వద్దే ఉం­చు­కు­న్నా­రు. ఇం­దు­లో ఏ శా­ఖ­ను ఆయ­న­కు ఇస్తా­ర­నే ఆస­క్తి నె­ల­కొం­ది. అయి­తే మై­నా­ర్టీ సం­క్షేమ శాఖ లేదా క్రీ­డా శాఖ ఇస్తా­ర­ని ప్ర­చా­రం నడు­స్తోం­ది. మరోవైపు తె­లం­గాణ మం­త్రి­గా అజా­రు­ద్దీ­న్‌ ప్ర­మాణ స్వీ­కా­రం చే­శా­రు. గవ­ర్న­ర్‌ జి­ష్ణు­దే­వ్‌ వర్మ ఆయ­న­తో ప్ర­మా­ణం చే­యిం­చా­రు. కా­ర్య­క్ర­మం­లో సీఎం రే­వం­త్‌­రె­డ్డి, మం­త్రు­లు పా­ల్గొ­న్నా­రు. ప్ర­మాణ స్వీ­కా­రం చే­సిన తర్వాత ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి­కి అజా­రు­ద్దీ­న్ కృ­త­జ్ఞత తె­లి­య­జే­శా­రు. సహచర మం­త్రు­లు, నా­య­కు­లు ఆయ­న­కు అభి­నం­ద­న­లు తె­లి­య­జే­శా­రు.

ఇదీ ప్రస్థానం..

1963 ఫి­బ్ర­వ­రి 8న హై­ద­రా­బా­ద్‌­లో అజా­రు­ద్దీ­న్‌ జన్మిం­చా­రు. అబి­డ్స్‌­లో­ని ఆల్‌ సె­యిం­ట్స్‌ హై­స్కూ­ల్‌­లో పా­ఠ­శాల వి­ద్య­ను అభ్య­సిం­చా­రు. ని­జాం కా­లే­జీ­లో బీ­కాం చది­వా­రు. మే­న­మామ జై­ను­లా­బు­ద్దీ­న్‌ స్ఫూ­ర్తి­తో క్రి­కె­ట్‌ వైపు అడు­గు­లు వే­శా­రు. 1984లో అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­లో రం­గ­ప్ర­వే­శం చే­శా­రు. అజా­రు­ద్దీ­న్‌ క్రి­కె­ట­ర్‌­గా ప్ర­త్యేక గు­ర్తిం­పు తె­చ్చు­కు­న్నా­రు. తొలి మూడు టె­స్టు­ల్లో­నూ సెం­చ­రీ­ల­తో సం­చ­ల­నం సృ­ష్టిం­చా­రు. 1989లో భారత క్రి­కె­ట్ జట్టు కె­ప్టె­న్‌­గా భా­ధ్య­త­లు చే­ప­ట్టా­రు. 16 ఏళ్ల క్రి­కె­ట్‌ కె­రీ­ర్‌­లో 99 టె­స్టు­లు, 334 వన్డే­లు ఆడా­రు. రి­టై­ర్మెం­ట్‌ తర్వాత రా­జ­కీ­యా­ల్లో­కి వచ్చా­రు. 2009 ఫి­బ్ర­వ­రి 19న కాం­గ్రె­స్‌­పా­ర్టీ­లో చే­రా­రు. అదే సం­వ­త్స­రం యూ­పీ­లో­ని మొ­రా­దా­బా­ద్‌ స్థా­నం నుం­చి ఎం­పీ­గా గె­లు­పొం­దా­రు. 2018లో టీ­పీ­సీ­సీ వర్కిం­గ్‌ ప్రె­సి­డెం­ట్‌­గా అజా­రు­ద్దీ­న్‌­ను ని­య­మిం­చా­రు. తొ­లి­సా­రి 1984లో అం­త­ర్జా­తీయ క్రి­కె­ట్‌­లో రం­గ­ప్ర­వే­శం చేసి తన­కం­టూ ప్ర­త్యేక గు­ర్తిం­పు తె­చ్చు­కు­న్నా­రు. అలా­నే మొ­ద­టి 3 టె­స్టు­ల్లో­నూ సెం­చ­రీ­ల­తో సం­చ­ల­నం సృ­ష్టిం­చా­రు.

Tags

Next Story